ధోనిపై రాజ‌మౌళి సంచ‌ల‌న కామెంట్స్‌…!

dhoni-and-rajamouli

 

ఎమ్ఎస్ ధోని.. ఇన్నాళ్లూ క్రికెట్‌కే ప‌రిచ‌య‌మైన ఈ పేరు.. తాజాగా వెండితెర‌పైనా వెలుగులు విర‌జిమ్మ‌డానికి రెడీ అవుతోంది. ధోని బ‌యోగ్ర‌ఫీగా తెర‌కెక్కిన ఎమ్ఎస్ ధోని చిత్రం విడుద‌ల‌కు రెడీ అవుతోంది. ఇండియన్ క్రికెట్‌కి ఎన్నో తిరుగులేని విజ‌యాలు అందించిన ధోని దేశ‌వ్యాప్తంగా పాపులారిటీ ఉంది. అందుకే, బాలీవుడ్‌లో తెరకెక్కిన ఈ సినిమాని హిందీతోపాటు తెలుగు, త‌మిళ్ వంటి ఇత‌ర భాష‌ల‌లోనూ విడుదల చేస్తున్నారు. సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోని పాత్ర పోషించాడు.

ఈ సినిమా ఆడియో రిలీజ్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది.ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా జ‌క్క‌న్న హాజ‌ర‌య్యారు. ధోని ఆడియో రిలీజ్‌కి రావ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు రాజ‌మౌళి.  ఇండియన్‌టీమ్‌లోకి ధోని ఎంట్రీకి ముందు క్రికెట్‌ని భ‌యంతో చూసేవాడిన‌ని.. ధోని వ‌చ్చాక సంతోషంగా చూస్తున్నామ‌ని చెప్పారు. ధోని కర్మ‌యోగి అంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు రాజ‌మౌళి. అంతేకాదు, రాబోయే ప్ర‌పంచ‌క‌ప్‌కి కూడా ధోనీనే నాయ‌క‌త్వం వ‌హించాల‌ని కోరారు జ‌క్క‌న్న‌. ఇటు, ధోని కూడా రాజ‌మౌళి గురించి కితాబులు ఇచ్చాడు. గ‌తేడాది బాహుబ‌లి చూశాన‌ని, ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నాన‌ని చెప్పాడు ధోని.

రాజ‌మౌళి చెప్పిన మాట‌ల్లో ఎంతో వాస్త‌వం ఉంది. ధోని రాక‌ముందు భార‌త క్రికెట్‌కు విజ‌యాల‌కంటే అప‌జ‌యాలే ఎక్కువ‌గా వచ్చాయి. ఆయ‌న వ‌చ్చాక టీమిండియాలో నిల‌క‌డ క‌నిపించింది. స‌క్సెస్ ప‌ర్సంటేజ్ కూడా పెరిగింది. టీ-20, వ‌న్‌డే వ‌రల్డ్ క‌ప్‌ను కూడా ఇండియాకి అందించాడు ధోని. అందుకే, ధోని గురించి రాజ‌మౌళి చెప్పింది కాస్త ఎక్కువ అనిపించినా అది మాత్రం వాస్త‌వం.

 

Loading...

Leave a Reply

*