23న రాజ‌మౌళి పార్టీ.. మ‌హేష్‌, ఎన్టీఆర్‌, బ‌న్ని, చెర్రీకి ఇన్విటేష‌న్‌లు..?

untitled-21

జ‌క్క‌న్న భారీ పార్టీకి రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. అక్టోబ‌ర్ 23న ప్ర‌భాస్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న భారీ పార్టీకి ప్లాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బాహుబ‌లి సెట్స్‌పైకి వ‌చ్చి మూడేళ్లు. ఆ మూడేళ్లుగా ఛ‌త్ర‌ప‌తి హీరో ఈ ఒక్క సినిమా కోస‌మే వెయిట్ చేశాడు. మ‌రో మూవీకి క‌మిట‌వ్వ‌లేదు. ఇటు, బాహుబ‌లి సినిమా రాజ‌మౌళి డ్రీమ్‌. ఆయ‌న డ్రీమ్ ప్రాజెక్ట్ కోస‌మే వ‌ర్క్ చేస్తున్నా అని చెబుతున్నాడు ప్ర‌తి సారి ప్ర‌భాస్‌. అందుకే, ప్ర‌భాస్ త్యాగానికి గుర్తుగా ఓ పార్టీని ఇవ్వాల‌ని డిసైడ్ అవుతున్నాడ‌ట రాజ‌మౌళి.హైద‌రాబాద్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోట‌ల్‌లో కానీ, లేదంటే.. రామోజీ ఫిలిం సిటీలో కానీ ఈ పార్టీని అరేంజ్ చెయ్యాల‌ని భావిస్తున్నాడ‌ట జ‌క్క‌న్న‌.

ఈ బ‌ర్త్ డే ఈవెంట్‌కి టాలీవుడ్‌లోని టాప్ హీరోల‌ని, హీరోయిన్‌ల‌ను కూడా ఆహ్వానించాల‌ని భావిస్తున్నాడ‌ట రాజ‌మౌళి. ఇప్ప‌టికే ఆల్‌మోస్ట్ ఆహ్వానితుల లిస్ట్ సిద్ధ‌మ‌యింద‌ని.. వారిలో కొంత‌మందికి ఇప్ప‌టికే క‌బురు అందిందని స‌మాచారం. ఈ జాబితాలో మ‌హేష్‌, ఎన్టీఆర్‌, బ‌న్ని, చెర్రీ వంటి స్టార్ హీరోలు కూడా ఉన్నార‌ట‌. వారి ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ను కూడా ఆహ్వానిస్తున్నాడ‌ట జ‌క్క‌న్న‌. సౌత్‌లో ఇంత పెద్ద పార్టీ ఇప్ప‌టివ‌ర‌కు జ‌ర‌గ‌లేద‌ని… అలా గ్రాండ్‌గా అరేంజ్ మెంట్‌లు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

రాజ‌మౌళితో పాటు ఇటు ప్ర‌భాస్ కూడా త‌న పుట్టిన రోజు వేడుక‌కి త‌న ఫ్రెండ్స్‌కి గ్రాండ్ పార్టీ సిద్ధం చేస్తున్న‌ట్లు స‌మాచారం. మొత్త‌మ్మీద‌, బాహుబ‌లి టీమ్ ఫుల్ జోష్‌లో ఉంది. బాహుబ‌లి 2పై అంచ‌నాల‌కు మించి బిజినెస్ అవుతోంది. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో ఒక్క అమెరికా మార్కెట్‌లోనే 45 కోట్ల‌కు సేల్ అయింది. ఇటు, నైజాం ఏరియాలోనూ ఈ చిత్రం అంతే డిమాండ్ ప‌లికింది. సో.. టోట‌ల్‌గా 400 కోట్ల మార్కెట్ చెయ్యాల‌ని అంచ‌నాలు పెట్టుకున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. అందుకే, ఆ ఆనందంలోనే ఈ పార్టీ ఇస్తున్నాడ‌ట జ‌క్క‌న్న‌. మ‌రి, ఈ పార్టీకి ఎవ‌రెవ‌రు వ‌స్తార‌నేది చూడాలి.

Loading...

Leave a Reply

*