మ‌హేష్‌తో రాజ‌మౌళి సినిమా తూచ్‌

untitled-31

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓట‌మి ఎరుగ‌ని ద‌ర్శ‌కధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి… స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్‌తో మొద‌లుపెట్టి టాలీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్ డైరెక్ట‌ర్ అయ్యాడు… ఆయ‌న హిట్‌లిస్ట్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది… రాజ‌మౌళి జైత్ర‌యాత్ర సాగుతూనే ఉంది… తాజాగా బాహుబ‌లి సినిమాతో ఆయ‌న పాపులారిటీ పీక్స్‌కు చేరింది…. ఆ సినిమా ఇండియాలోనే ఆల్‌టైమ్ హిట్ రికార్డు సాధించింది… వంద‌ల కోట్లు కొల్లగొట్టింది… అలాంటి టాప్‌మోస్ట్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి… త‌మిళ డైరెక్ట‌ర్ శంక‌ర్‌ని మించిన రిచ్‌నెస్‌తో సినిమాలు తీసే ద‌మ్ము ధైర్యం ఉన్న ఏకైక తెలుగు ద‌ర్శ‌కుడు… మ‌రోవైపు మ‌హేష్‌బాబు.. టాలీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్ స్టార్‌…. మ‌హేష్ మూవీ అంటే యూత్ వెర్రెక్కిపోతారు…

ఇక అమ్మాయిలైతే చెప్ప‌న‌క్క‌ర్లేదు… మ‌హేష్‌ని చూపుల‌తోనే చంపేస్తారు… అలాంటి టాలీవుడ్ టాప్ హీరో మ‌హేష్‌బాబుతో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సినిమా తీస్తే ఎలా ఉంటుంది… ఓహ్ మైగాడ్ అంటున్నారు అభిమానులు…ఒళ్లంత థ్రిల్లింత అంటున్నారు ఫ్యాన్స్‌… టాలీవుడ్‌లో అంద‌రు హీరోల‌తో సినిమాలు తీసిన రాజ‌మౌళి ఇద్ద‌రే ఇద్దరు హీరోల‌తో సినిమాలు తీయ‌లేదు.. మ‌హేష్‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌తో రాజ‌మౌళి సినిమా తియ్య‌లేదు… ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినిమా తీయ‌డం అంత సుల‌భం కాద‌ని గ‌తంలో రాజ‌మౌళి చెప్పాడు…అయితే సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో ఓ మంచి సినిమా తీయాల‌నే అభిప్రాయంతో ఉన్న‌ట్టు గ‌తంలో రాజ‌మౌళి చెప్పారు…

బాహుబ‌లి-2 త‌ర్వాత రాజ‌మౌళికి రెండు సినిమా క‌మిట్‌మెంట్లు ఉన్నాయి… ఈ రెండింటిలో ఒక‌టి మ‌హేష్‌బాబుతో ఉంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు… ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ అన్ని రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతుంద‌ని కూడా భావిస్తున్నారు… అయితే రాజ‌మౌళి సినిమా తీయ‌డానికి చాలాకాలం తీసుకుంటాడు… త‌న‌కు తృప్తి వ‌చ్చేవ‌ర‌కు అల‌సిపోయే వ‌ర‌కు ఆ సినిమాను చెక్కుతూనే ఉంటాడు…. అంత‌కాలం ఆగే ఓపిక మ‌హేష్‌కి లేదు… దీంతో మ‌హేష్‌తో రాజ‌మౌళి సినిమా తూచ్ అంటున్నాయి ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు.

Loading...

Leave a Reply

*