ఇటు ఎన్టీఆర్‌, అటు నాని.. తేల్చుకోలేక‌పోతున్న‌ రాజ‌మౌళి..!

ntrnani-and-rajamouli

బాహుబ‌లి 2 ఇంకా పూర్తికాలేదు. ఈ సినిమా షూటింగ్ న‌వంబర్ ఎండింగ్‌కి ఫినిష్ అవుతుంది. ఆ త‌ర్వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌తో బిజీ. ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ ఫిక్స్ అంటూ ఇప్ప‌టికే బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ఈ విష‌యం ప‌క్క‌న‌పెడితే… బాహుబ‌లి 2 త‌ర్వాత జ‌క్క‌న్న ఏ మూవీ చెయ్యబోతున్నాడు…? ఇది ఓ బిగ్ ప‌జిల్‌లా మారింది. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అనే రేంజ్‌లో కాక‌పోయినా.. రాజ‌మౌళి నెక్స్ట్ మూవీపై ఇప్ప‌టినుంచే హాట్ హాట్‌గా చ‌ర్చ‌లు షురూ అయ్యాయి.

ఇటు నాని ఏమో ఇప్ప‌టినుంచే ఈగ 2 చెయ్యండి సార్ అంటూ ట్వీట్‌ల మీద ట్వీట్‌లు చేస్తున్నాడు. అటు రాజమౌళికి మ‌హాభారతం లాంటి సినిమా ఎన్టీఆర్‌తో చెయ్యాల‌ని ఉంద‌ని త‌న స‌న్నిహితుల‌తో అన్న‌ట్లు మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాదు, రీసెంట్‌గా త‌న కెరీర్ ప‌దిహేనేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా తార‌క్‌పై త‌న అనుబంధాన్ని పంచుకున్నాడు. అంటే, జక్క‌న్న‌కు యంగ్‌టైగ‌ర్‌తోనే సినిమా చెయ్యాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌నే రూమ‌ర్‌లు వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు, రాజ‌మౌళి స‌న్నిహితులు.. బాహుబ‌లి, బాహుబ‌లి 2 వంటి బిగ్ కాన్వాస్ సినిమాల త‌ర్వాత ఓ చిన్న మూవీ చేస్తాడ‌నే వాద‌న‌ను తెర‌పైకి తెస్తున్నారు. ఇటీవ‌ల నాని మంచి ప‌రిణ‌తి గ‌ల నటుడిగా ఎదిగాడు. ప్ర‌తి సినిమాలోనూ వేరియేష‌న్ చూపిస్తున్నాడు. కేరక్ట‌ర్ల ఎంపిక‌లోనే కాదు, న‌ట‌న‌లోనూ తిరుగులేద‌నిపించుకుంటున్నాడు. నానితో ఓ మూవీ చేస్తే బావుంటుంద‌ని భావిస్తున్నాడ‌ట జ‌క్క‌న్న‌. అయితే, అది ఈగ సీక్వెల్ కాకూడ‌ద‌ని, ఓ వెర‌యిటీ మూవీ అయితే బావుండున‌ని ఆలోచిస్తున్నాడ‌ట‌. ఈ ఇద్ద‌రి హీరోల‌యితే ప్ర‌స్తుతం ఆయ‌న మ‌న‌సులో ఫిక్స్ అయ్యార‌ట‌. దీంతో, బాహుబ‌లి 2 త‌ర్వాత జ‌క్క‌న్న చిత్రం ఎవ‌రితో అనేది త్వర‌లోనే తేల‌నుంది.

Loading...

Leave a Reply

*