పుకార్లపై రియాక్ట్ అయిన రాజమౌళి

untitled-8

తన సినిమాపై ఎప్పుడు ఎలాంటి గాసిప్ వచ్చినా వెంటనే రియాక్ట్ అవ్వడం రాజమౌళి స్టయిల్. ఈమధ్య షూటింగ్ హడావుడిలో పడి అలాంటి రియాక్షన్ లు తగ్గించినా, తాజాగా మరోసారి పుకార్లకు చెక్ పెట్టే పనిలో బిజీ అయిపోయాడు జక్కన్న. సినిమా షూటింగ్ ఓ కొలిక్కి రావడంతో రాజమౌళి కాస్త ఫ్రీ అయ్యాడు. ఇప్పుడు ఒక్కో పుకారుకు తాపీగా క్లారిటీ ఇస్తున్నాడు. తాజాగా బాహుబలి-2 రిలీజ్ డేట్ కు సంబంధించి కూడా మరోసారి పక్కా క్లారిటీ ఇచ్చాడు జక్కన్న. తమ సినిమా ఏప్రిల్ 28న కచ్చితంగా వచ్చి తీరుతుందంటున్నాడు. విడుదల తేదీ విషయంలో ఎలాంటి మార్పులు లేవని ప్రకటించేశాడు.జక్కన్న ఇలా చెప్పిన విషయాన్నే మరోసారి గట్టిగా చెప్పడానికి ఓ కారణం ఉంది. బాహుబలి-2 సినిమా ఇంకాస్త ముందే విడుదలయ్యే అవకాశాలున్నాయని, ఈమధ్య కొత్తగా ఓ రూమర్ బయల్దేరింది.

ప్రీ-రిలీజ్ బిజినెస్ తో పాటు షూటింగ్ కూడా దాదాపు ఫైనల్ స్టేజ్ కు వచ్చేయడంతో… అనుకున్న టైం కంటే కాస్త ముందుగానే సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తే బాగుంటుందని భావించారట. నిజానికి ఈ ప్రపోజల్ తెచ్చింది సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లే అని తెలుస్తోంది. కోట్ల రూపాయలు అడ్వాన్సులుగా ఇచ్చేశాం కాబట్టి కాస్త ముందే సినిమాను రిలీజ్ చేస్తే, కోలుకుంటామని చాలామంది రిక్వెస్ట్ చేశారట. మరోవైపు ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత కూడా ఎక్కువ గ్యాప్ ఇస్తే, అది పైరసీకి అనుకూలంగా మారుతుందని కూడా చాలామంది అంటున్నారు. అందుకే బాహుబలి-2ను కాస్త ముందుగానే థియేటర్లలోకి తీసుకొస్తారనే పుకారు షికారు చేసింది. అయితే అలాంటిదేం లేదని రాజమౌళి తాజాగా ప్రకటించాడు.

Loading...

Leave a Reply

*