ప్ర‌భాస్ టీమ్‌పై రాజ‌మౌళి ఆగ్ర‌హం..!

rajamouli

రాజ‌మౌళి ఎప్పుడూ కూల్‌గా శాంత‌మునిలా క‌నిపిస్తాడు. ఆయ‌న‌కు తొంద‌ర‌గా కోపం రాదు అంటారు. సెట్స్‌పై తన‌కు కావాల్సిన అవుట్‌పుట్‌ని రాబ‌ట్టేందుకు కూడా ఆయ‌న ఎంతో నిగ్ర‌హంతో వ్య‌వ‌హ‌రిస్తార‌ట‌. ఎవ‌రిపైనా అంత‌గా అస‌హ‌నాన్ని, కోపాన్ని క‌న‌బ‌ర‌చ‌ర‌ట‌. అలాంటి జ‌క్క‌న్న‌కి తాజాగా ప్ర‌భాస్ టీమ్‌పై ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంద‌ట‌. ఎందుకంటే, దీనివెనుక పెద్ద స్టోరీయే ఉంద‌ని స‌మాచారం.సౌత్ ఇండియాలోనే ఏ హీరోకి ద‌క్క‌ని అరుదైన గౌర‌వాన్ని యంగ్‌రెబ‌ల్ స్టార్ పొందాడు. టుస్సాడ్ మ్యూజియంలో మైన‌పు బొమ్మ పెట్ట‌డం అంటే మాట‌లు కాదు. అలాంటి అరుదైన గౌర‌వం ద‌క్క‌డంతోనే రెండేళ్లుగా తెలుగు మీడియాని ప‌ట్టించుకోని బాహుబ‌లి టీమ్‌… ఒక్క‌సారిగా ప్రెస్ మీట్ పెట్టింది.

అక్టోబ‌ర్ 5న ఓ న్యూస్ మీతో షేర్ చేసుకుంటాం.. అంటూ ప్ర‌క‌టించింది. అది టుస్సాడ్ మ్యూజియంలో బాహుబలి విగ్ర‌హం న్యూసే అని, కానీ, అంత‌లోనే ప్ర‌భాస్ టీమ్ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి దానిని లీక్ చేశార‌ట‌. దీంతో, ఏం చెయ్యాలో తెలియ‌క రాజ‌మౌళి తీవ్ర ఆగ్ర‌హానికి లోన‌య్యాడ‌ట‌. ఫైన‌ల్‌గా ఏం చేసేది లేక‌.. ఈ రోజుల్లో ఏ న్యూస్‌ని దాచలేం.. అంటూ ఓ చిన్న ట్వీట్‌తో స‌రిపెట్టాడు.బాహుబ‌లి టుస్సాడ్ సీక్రెట్ లీక్ అయినా.. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని చంప‌డం సీక్రెట్‌ని మాత్రం రాజ‌మౌళి ఏడాదిన్న‌ర‌గా కాపాడుతున్నందుకు అభినందించాలి అంటున్నారు. టోట‌ల్‌గా రాకరాక తెలుగు మీడియాని కాక‌ప‌డ‌దామ‌నుకున్న రాజ‌మౌళి టీమ్‌కి చుక్కెదుర‌యింద‌న్న‌మాట‌.

Loading...

Leave a Reply

*