ఆ మూవీలో ఎన్టీఆరే హీరో.. ఇది ఫిక్స్‌.. రాజ‌మౌళి మాట‌..!

ntr-and-rajamouli

రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చి ప‌దిహేనేళ్లు. ఈ 15ఏళ్ల ప్ర‌యాణంలో ఆయ‌న చేసింది కేవ‌లం 10 చిత్రాలు.. కానీ, ఒక‌దానిని మించిన స‌క్సెస్ మ‌రొక‌టి. స్టూడెంట్ నెం.1 ఆయ‌న తొలి చిత్రం. ఆ త‌ర్వాత సింహాద్రి, సై, ఛ‌త్ర‌ప‌తి, విక్ర‌మార్కుడు, మ‌గ‌ధీర‌, మ‌ర్యాదరామన్న, ఈగ‌, బాహుబ‌లి వంటి సినిమాలు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం బాహుబ‌లి 2పై ఫోక‌స్ పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు ఫినిషింగ్ స్టేజ్‌కి వ‌చ్చింది. న‌వంబ‌ర్ ఎండింగ్‌కి గుమ్మ‌డికాయ కొట్ట‌నున్నారు ఈ మూవీకి.

బాహుబ‌లి 2 త‌ర్వా త జ‌క్క‌న్న సినిమా ఏంటి..? ఆయ‌న ఏ సినిమా చెయ్య‌బోతున్నాడు.. ? ఆయ‌న డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి..?  వీటిపై ఇప్ప‌టినుంచే ఎంతో క్యూరియాసిటీ ఉంది. ఇప్ప‌టికే గ‌రుడ మూవీకి రెడీ అవుతున్నాడ‌ని కొంద‌రు చెబుతుంటే.. మ‌రికొంద‌రు బాహుబ‌లి 3  చేస్తాడ‌ని అంటున్నారు. వీటి సంగతి ఎలా ఉన్నా.. ఇండస్ట్రీకి వచ్చి 15ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు రాజమౌళి. బాహుబ‌లిని మించిన క‌థ‌తో సినిమా చెయ్యాల‌ని.. అది మ‌హాభార‌త క‌థ అయితే బావుండున‌ని చెప్పాడ‌ట‌.

త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ అదేన‌ని తెలిపాడ‌ట‌. అయితే, త‌న ఆధునిక మ‌హాభారతంలో ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా కొన్ని పాత్రలు ఉన్నాయని, ఎన్టీఆర్ లేని మహాభారతం ఉండదని తన సన్నిహితుల దగ్గర మాట్లాడినట్లు టాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. యంగ్ టైగర్‌పై రాజమౌళికి ఉన్న నమ్మకానికి ఆ వ్యాఖ్యలు పరాకాష్టగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.

 

Loading...

Leave a Reply

*