రాజ‌మౌళికి కామ‌న్‌సెన్స్ లేదా?

rajamouli

టాలీవుడ్‌లో టాప్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి… బాహుబ‌లితో ఆయ‌న ఇండియాలోనే టాప్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా మారిపోయాడు…. ఇప్పుడు టాలీవుడ్ లో ఆయ‌న‌కు పోటీ ఇచ్చే ద‌ర్శ‌కులే లేరు… ఇప్పుడు రాజ‌మౌళిది ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌… ఆయ‌న త‌న సినిమాలో ప్ర‌తి అంశాన్ని క్షుణ్నంగా ప‌రిశీలిస్తాడు… అమ‌ర‌శిల్పి జ‌క్క‌న‌ రాళ్ల‌కు ప్రాణం పోసిన‌ట్టు ఈయ‌న రీళ్ల‌కు ప్రాణం పోస్తాడు… త‌న సినిమా అంద‌మైన శిల్పంగా మారేవ‌ర‌కు త‌దేక దీక్ష‌తోనే చెక్కుతూ ఉంటాడు…అయితే ఇలాంటి రాజ‌మౌళిని ప‌ట్టుకుని నీకు అస‌లు కామ‌న్‌సెన్స్ ఉందా అని అడుగుతున్నాడు కామ‌న్ మేన్‌… రాజ‌మౌళి నువ్వు కామ‌న్‌సెన్స్ లేకుండా ఇలా నాన్సెన్స్‌తో న్యూసెన్స్ చేస్తే బాహుబ‌లి1 అట్ట‌ర్‌ఫ్లాప్ అయ్యేది తెలుసా అంటున్నారు మేధావులు… అస‌లు విష‌యం ఏంటంటే బాహుబ‌లి1 సినిమాకి ప్రాణం శివ‌గామి…. ఆ పాత్ర‌కు ప్రాణం పోసింది సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ‌…

సినిమాకు మ‌లుపు గెలుపు తీసుకువ‌చ్చింది ఆ కేర‌క్ట‌ర్‌…. అయితే శివ‌గామి పాత్ర‌కు మొద‌ట ర‌మ్య‌కృష్ణ పేరు అనుకోలేదుట రాజమౌళి… మొద‌ట శ్రీదేవిని అడిగారు, ఆ త‌ర్వాత టాబూను అడిగారు… వాళ్లు కాద‌న్నారు… అప్పుడు ఫైన‌ల్‌గా మంచు ల‌క్ష్మి అయితే ఈ పాత్ర‌కు న్యాయం చేస్తుంద‌ని భావించి ఆమెను అడిగాట్ట రాజ‌మౌళి.. ఆ ఆఫ‌ర్‌తో షాక్ తిన్న మంచు ల‌క్ష్మి ప్ర‌భాస్‌కి, రానాకి త‌ల్లిగా తాను న‌టించ‌ను అని చెప్పిందిట‌… దీంతో ఇక చేసేదిలేక ర‌మ్య‌కృష్ణను తీసుకున్నాట్ట రాజ‌మౌళి… ఇదంతా విన్న జ‌నంలో అమాయ‌కులైన వాళ్లు మంచు ల‌క్ష్మి మంచి ఆఫ‌ర్ పోగొట్టుకుంద‌ని బాధ‌ప‌డితే, మంచు ల‌క్ష్మిని పెట్టుకుంటే సినిమాని ముంచేసేది అని తెలివైన‌వాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు..

అయినా ఎంతో ఆలోచించే రాజ‌మౌళి ఇలా క‌ప్పులో కాలేయ‌డం ఏంటి… శివ‌గామి పాత్ర‌కు మంచు ల‌క్ష్మిని అడ‌గడం ఏంటి…. రాజ‌మౌళికి కామ‌న్‌సెన్స్ లేకుండా పోయిందా అంటూ క్రిటిక్స్ విమ‌ర్శిస్తున్నారు… రాజ‌మౌళి, ప్ర‌భాస్‌ల అదృష్టం కొద్దీ మంచుల‌క్ష్మిని తీసుకోలేదు కానీ… ఆమెనే తీసుకుంటే కంచు అయిపోయేది… బాహుబ‌లి1 అట్ట‌ర్‌ఫ్లాప్ అయ్యేదేమో అంటున్నారు సినీ జ‌నం.

Loading...

Leave a Reply

*