రాజ్‌త‌రుణ్‌, లాస్య సీక్రెట్ మ్యారేజ్‌..!

raj-tharun-lasya-secret-marriage

ఇది నిజ‌మో అబద్ధ‌మో కానీ… ఈ ఇద్ద‌రూ మ్యారేజ్ అయిపోయింద‌నే టాక్ వినిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ విజ‌యాల‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్న రాజ్ త‌రుణ్‌.. గ‌త కొంత‌కాలంగా యాంక‌ర్ లాస్యతో డీప్ ల‌వ్‌లో ఉంద‌ట‌. ఇటు, పెద్ద‌ల‌కు తెలియ‌కుండా.. ఇద్ద‌రూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నార‌నే టాక్ వెబ్ మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

లాస్య‌-రాజ్‌త‌రుణ్‌కి ఓ టీవీ షో ఇంట‌ర్‌వ్యూకి వ‌చ్చిన‌ప్పుడు ప‌రిచ‌యం జ‌రిగింద‌ని, అదే ప్రేమ‌గా మారిందని, అయితే, రాజ్‌త‌రుణ్ ఇంట్లో చెప్ప‌గా వారు పెళ్లికి నిరాక‌రించార‌నే టాక్ వినిపిస్తోంది. అప్ప‌టినుంచి రాజ్‌త‌రుణ్‌… లాస్య‌ని టీవీ షోల‌కు దూరంగా ఉండాల‌ని చెప్పాడ‌ట‌. ఆయ‌న సూచ‌న మేర‌కే కొంత‌కాలంగా లాస్య బుల్లితెర‌కు దూరంగా ఉంద‌ని కొంద‌రు అంటున్నారు. అయినా, రాజ్ త‌రుణ్ కుటుంబం నుంచి సానుకూల స్పంద‌న రాక‌పోవ‌డంతో.. ఇక పెళ్లి చేసుకోవ‌డ‌మే బెట‌ర‌ని నిర్ణయించుకున్నార‌ని, అందుకే, ర‌హ‌స్య వివాహం చేసుకున్నార‌ని గాసిప్ రాయుళ్లు చెబుతున్నారు.

లాస్య మ్యారేజ్‌పై పుకార్లు కొత్త‌కాదు. కొంత‌కాలం క్రితం ఆమె స్మాల్ స్క్రీన్ యాంక‌ర్ ర‌వితో పెళ్ల‌యింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆమె సూసైడ్ చేసుకుందనే రూమ‌ర్ వినిపించింది. అయితే, అబ‌ద్ధం అని త‌ర్వాత తేలింది. కానీ, రాజ్‌త‌రుణ్‌తో పెళ్లి మాత్రం క‌న్‌ఫ‌మ్ అని వెబ్‌మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి, దీనిపై ఓ క్లారిటీ ఎవ‌రొస్తార‌నేది? హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి, రేపో మాపో అటు రాజ్‌త‌రుణ్ లేదా ఇటు లాస్యలో ఎవ‌రు స్పందిస్తార‌నేది చూడాలి.

Loading...

Leave a Reply

*