రెజినాకి సీక్రెట్ ఎంగేజ్ మెంట్

rezina

నిన్నంతా హీరోయిన్ రెజీనా హాట్ టాపిక్ గా మారిపోయింది. తెలుగులో బి-గ్రేజ్ హీరోయిన్ గా కొనసాగుతున్న రెజీనా.. తనకు నిశ్చితార్థం అయిపోయిందని ప్రకటించింది. అంతేకాదు.. దానికి సంబంధించి ఓ ఫొటోను కూడా పోస్ట్ చేసింది. ప్రేక్షకుల దీవెనలు కావాలంటూ ట్వీట్ కూడే చేసింది. దీంతో అంతా షాక్ అయ్యారు. నిజంగానే రెజీనాకు ఎంగేజ్ మెంట్ అయిపోయిందా అని ఆరాలు తీశారు. ఎఁదుకంటే.. ఈమధ్య హీరోయిన్లంతా ఇలానే తయారయ్యారు. సడెన్ గా పెళ్లి కబుర్లు లేదా ప్రేమగీతాలు వినిపిస్తున్నారు. రెజీనా కూడా ఆ లిస్ట్ లోకి చేరిపోయిందేమో అని అంతా అనుకున్నారు.

తనకు నిశ్చితార్థం జరిగిన మాట వాస్తవమే అని ప్రకటించిన ఈ బ్యూటీ… కాబోయే భర్త పేరు బయటపెట్టడానికి మాత్రం ఒప్పుకోలేదు. ప్రస్తుతానికి ఆ పేరును సీక్రెట్ గా ఉంచుతున్నానని, త్వరలోనే ప్రకటిస్తానని చెప్పుకొచ్చింది. దీంతో అతడు కచ్చితంగా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే అయి ఉంటాడని అంతా గెస్ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే… తనకు ఎంగేజ్ మెంట్ అయిందని ప్రకటించిన కొద్ది సేపటికే.. రెజీనా తన ఎకౌంట్ లోంచి సదరు ఫొటోను, దానికి సంబంధించిన మేటర్ ను కూడా డిలీట్ చేసి, మరింత ఉత్కంఠకు గురిచేసింది.

అయితే తాజా సమాచారం ప్రకారం… ఓ కోలీవుడ్ సినిమా ప్రమోషన్ కోసం రెజీనా ఇదంతా చేస్తోందని తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఆ సినిమాకు మరింత బజ్ క్రియేట్ చేసేందుకే.. రెజీనా ఇలా ట్విట్టర్ లో నాటకాలు ఆడుతోందని చాలామందికి తెలిసిపోయింది. నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఎంతలా ప్రభావం చూపించిందంటే… నిజంగా రెజీనా పెళ్లి చేసుకొని ఆ ఫొటో పోస్ట్ చేసినా ఎవరూ నమ్మనంత స్థాయికి ప్రేక్షకులు వచ్చేశారు.

Loading...

Leave a Reply

*