రాధికా ఆప్టే మ‌రో సంచ‌ల‌న వీడియో.. ఈ సారి ఇలా..!

radhika

రాధికా ఆప్టే.. కాంట్ర‌వ‌ర్సీకి కేరాఫ్‌. న‌ట‌న‌తోనే కాదు.. వివాదాస్ప‌ద అంశాల‌తోనూ ఆమె ఎప్పుడూ వార్త‌ల్లో ఉంటుంది. సెల్ఫీల‌తో గ‌తంలో సంచ‌ల‌నం క్రియేట్ చేసిన ఈ భామ‌.. ఇటీవ‌ల న్యూడ్ వీడియోతో సోష‌ల్ మీడియాని షేక్ చేసింది. ప‌ర్చ్‌డ్ సినిమా కోసం ఆమె చేసిన కొన్ని న్యూడ్ సీన్‌లు.. సినిమాకి ముందే లీక్ అయ్యాయి. దీంతో, ఒక్క‌సారిగా సోష‌ల్ మీడియా హ‌ల్‌చ‌ల్ రేగింది. ఆ వివాదం స‌ద్దుమ‌ణిగిందో లేదో.. ఓ తెలుగు హీరో త‌న‌ను బెడ్‌రూమ్‌కి ర‌మ్మ‌న్నాడంటూ మ‌రో బాంబ్ పేల్చింది. సౌత్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అది మ‌రింత కాంట్ర‌వ‌ర్సీగా మారింది. అవి స‌ద్దుమ‌ణిగాయ‌నుకునేలోపే ఆమె మ‌రో వివాదానికి తెర‌తీసింది.

ప‌ర్చ్‌డ్ సినిమా త‌ర్వాత దాదాపు ఆమె మీడియాకి ముఖం చాటేసినంత ప‌నిచేశారు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్‌వ్యూ కోసం ఆమె ప్రెస్‌మీట్‌కి హాజ‌ర‌య్యారు. విలేకరులు ఆమెను న్యూడ్ సీన్‌లో ఎందుకు నటించారని ప్ర‌శ్నించారు. అంతే ఒక్క‌సారిగా కోపంతో ఊగిపోయింది లెజెండ్ నాయిక‌. “మీరు వేసిన ప్ర‌శ్న హాస్యాస్ప‌దంగా ఉంది. వివాదాలు మీరు సృష్టిస్తారు. ఆ క్లిప్‌ని మీరు చూస్తారు. మీ ప‌క్క‌వారికి షేర్ చేస్తారు. మ‌ళ్లీ మీరే కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ చేస్తారు.. నేనొక ఆర్టిస్ట్‌ని.. పాత్ర‌కు త‌గిన న్యాయం చేసేందుకు ఎంత‌టి క‌ఠిన ప‌రిస్థితిని అయినా ఫేస్ చేస్తాను.. ఏ విష‌యంలోనూ సిగ్గుప‌డాల్సిన ప‌నిలేదు.

చాలామంది ఎదుట‌వారి శ‌రీరాన్ని చూడ‌డానికి ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తారు, త‌మ బాడీ కూడా అలాంటిదేన‌ని చెప్పుకోవ‌డానికి సిగ్గు ప‌డ‌తారు“ అని సుదీర్ఘంగా క్లాస్ పీకింది. అంతేకాదు, ప‌ర్చ్‌డ్ సీన్ చూసే ముందు.. ఒక్క‌సారి మిమ్మ‌ల్ని మీరు అద్దంలో న‌గ్నంగా చూసుకోవాలి.. అప్పుడే అర్ధం అవుతుంది అంటూ.. మ‌ళ్లీ చెల‌రేగిపోయింది. దీంతో, జ‌ర్న‌లిస్ట్‌లు ఒక్క‌సారిగా అవాక్క‌య్యారు. ఆమె ఇంత‌లా ఎదురు తిరిగి మాట్లాడ‌డం ఊహించని వారు షాక్ తిన్నారు. ఆ వెంట‌నే రాధికా సున్నితంగా న‌వ్వేసింది. ఇలా, చివ‌రికి వారు కూడా లైట్ తీసుకున్నారు. ఒక్క‌సారి ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Loading...

Leave a Reply

*