మహేష్ కధలో బాలయ్య..పూరి అలా సెట్ చేశాడు…

mahesh

పూరి జగన్నాధ్ అంతే నిమిషం కూడా గ్యాప్ తీసుకోడు. మొన్నటికి మొన్న ఇజం సినిమాను విడుదల చేసిన పూరి జగన్నాధ్.. వెంటనే మరో సినిమాకు ప్లాన్ చేశాడు. కాకపోతే.. ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేసిన ఈ దర్శకుుడు.. తారక్ ఇంకా మౌనం వీడకపోవడంతో మిగతా ప్రయత్నాల్లో పడ్డాడు. మరోవైపు మహేష్ కోసం జనగణమన అనే కథ రాసుకున్న పూరి… అతడితో కూడా సినిమా చేసే ఛాన్స్ అందుకోలేకపోయాడు. ఎందుకంటే.. మహేష్ మరో ఏడాది వరకు బిజీ. అందుకే పూరి ఇప్పుడు ఇతర ప్రయత్నాల్లో ఉన్నాడు.

మొన్నటివరకు సల్మాన్ ఖాన్ తో సినిమా అంటూ వార్తలు వచ్చాయి. కుదిరితే ఇజం, కుదరకపోతే టెంపర్ సినిమాను రీమేక్ చేస్తాడంటూ వార్తలు వచ్చాయి. అయితే మహేష్ బాబే ఇంత బిజీగా ఉంటే… సల్మాన్ ఇంకెంత బిజీగా ఉండాలి. అందుకే ఆ ప్రయత్నాల నుంచి కూడా పూరి తప్పుకున్నాడట. తాజాగా ఇప్పుడు బాలయ్య బాబు వెంట పడ్డాడని తెలుస్తోంది. నటసింహానికి కథ వినిపించే పనిలో ఉన్నాడట.

అయితే ఇక్కడే ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మహేష్ కోసం రాసుకున్న జనగణమన కథనే బాలయ్యకు వినిపించబోతున్నాడట పూరి. ప్రస్తుతానికి మహేష్ బిజీగా ఉండడంతో… దేశభక్తి ప్రధానాంశంగా ఉన్న ఆ కథను బాలయ్యకు వినిపించాలని పూరి ఫిక్స్ అయ్యాడట. అయితే బాలయ్యకూడా ప్రస్తుతం ఖాళీగా ఏం లేడు. త్వరలోనే కృష్ణవంశీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.

Loading...

Leave a Reply

*