నాకు మూడ్ లేదు అంటున్న మాస్ రాజా..

untitled-10

మాస్ రాజా రవితేజ ఇక సినిమాలు చేయడా… మేకప్ కు కొన్నాళ్లు పేకప్ చెప్పేశాడా… రవితేజలో ఎందుకు ఇంత మార్పు వచ్చింది. సడెన్ గా సినిమాలు ఆపేయాల్సిన అగత్యం ఎందుకొచ్చింది. ఈ ప్రశ్నలకు జవాబులు తెలీదు కానీ.. రవితేజ మాత్రం ఒకే ఒక్క ఆన్సర్ చెబుతున్నాడు. తనకు మూడ్ లేదంటున్నాడు. అందుకే సినిమాలు ఒప్పుకోవడం లేదట. ఈ విషయాల్ని దర్శకుడు పూరి జగన్నాధ్ చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో రవితేజకు చాలా క్లోజ్ ఎవరైనా ఉన్నారంటే అది పూరి జగన్నాధ్ మాత్రమే. అలాంటి దర్శకుడు చెబుతున్నాడంటే కచ్చితంగా అందులో నిజం ఉండే ఉంటుంది.

కాబట్టి పూరి మాటల్ని అందరూ నమ్ముతున్నారు. ఇంతకీ పూరి జగన్నాధ్ చెప్పేదేంటంటే… రవితేజకు ప్రస్తుతం సినిమాలు చేసే ఓపిక లేదంట. మూడ్ అసలే లేదంట. వరుసగా 15 ఏళ్ల నుంచి సినిమాలు చేస్తూనే ఉన్నాడని, ఓ రకమైన నైరాశ్యంలోకి రవితేజ జారిపోయాడని అంటున్నాడు. అందుకే పెట్టీబెడా సర్దుకొని ప్రపంచపర్యటనకు వెళ్లిపోయాడని అంటున్నాడు. తనివితీరా తిరిగిన తర్వాత అప్పుడు మళ్లీ సినిమాల గురించి ఆలోచిస్తాడట రవితేజ. అంతేకాదు…

ప్రపంచపర్యటన కోసం తనను కూడా రమ్మనమని ఫోర్స్ చేశాడని, తనకు కుదరకపోవడంతో రవితేజ ఒంటరిగానే దేశాలు చుట్టేయాలని ఫిక్స్ అయిపోయాడని పూరి చెప్పుకొచ్చాడు. ఇంతకీ మాస్ రాజా ఇప్పుడు ఎక్కడున్నాడు. దేశంలోనే ఉన్నాడా… దేశం దాటేశాడా…? పూరి చెప్పిందంతా చూస్తుంటే… రవితేజ ఇప్పట్లో తన కొత్త సినిమా సంగతి చెప్పేలా లేడు. ఏమంటారు… అతడు నటించిన బెంగాల్ టైగర్ సినిమా విడుదలై దాదాపు ఏడాది కావొస్తుంది. అంటే ఏడాది నుంచి మాస్ రాజా ఖాళీ. ఇంకెన్నాళ్లు ఈ సీనియర్ హీరో గ్యాప్ తీసుకుంటాడో చూడాలి.

Loading...

Leave a Reply

*