అంతా అయిపోయింది.. పూరి మరోసారి ఖాళీ…

puri

అనుకున్నట్టే జరిగింది. ఎక్కువమంది ఏ విషయంలో భయపడ్డారో అదే జరిగింది. పూరి జగన్నాధ్ మరోసారి సెడన్ గా ఖాళీ అయిపోయాడు. ఒకప్పుడు వరుసపెట్టి సినిమాలు తీసిన ఈ దర్శకుడు.. ఇప్పుడు హీరోల్ని వెదుక్కోవాల్సిన పరిస్థిితికి వచ్చాడు. అందుకే స్టార్ హీరోలే కాకుండా…. మిగతా హీరోలందరితో సినిమాలు చేసేస్తున్నాడు. తాజాగా పూరి జగన్నాధ్ మరోసారి కుర్రహీరోల్ని వెదుక్కోవాల్సిన పరిస్థితికి వచ్చాడు.మొన్నటివరకు ఎన్టీఆర్ తో సినిమా అన్నాడు.

కానీ తారక్, పూరి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని వార్తలు వచ్చాయి. మరోవైపు ఈ దర్శకుడు నటసింహం బాలయ్యను కలిశాడని… మహేష్ కోసం రాసుకున్న జనగణమన కథను బాలయ్యకు వినిపించాడనే టాక్ వచ్చింది. అయితే తాజాగా బాలయ్య కూడా పూరికి హ్యాండ్ ఇచ్చాడట. ప్రస్తుతం శాతకర్ణి సినిమా చేస్తున్నానని, దాని తర్వాత కృష్ణవంశీ సినిమా ఉందని… ఈ రెండూ కంప్లీట్ అయిన తర్వాత చూద్దామని సున్నితంగా చెప్పి పంపించేశాడట.

మరోవైపు మహేష్, నాగార్జున లాంటి స్టార్లు కూడా బిజీ అయిపోవడంతో పూరి మరోసారి ఖాళీ అయిపోయాడు. గతంలో ఇలానే కెరీర్ లో ఖాళీ వచ్చిన టైమ్ లో వరుణ్ తేజను హీరోగా పెట్టి లోఫర్ సినిమా చేశాడు పూరి. సో.. ఈసారి కూడా అలానే ఈ ఖాళీని ఓ కుర్రహీరోతో భర్తీచేయాలని అనుకుంటున్నాడట. మరి ఈసారి పూరి కంట్లో పడే ఆ కుర్రహీరో ఎవరో చూడాలి.

Loading...

Leave a Reply

*