ఇతడు చెబుతోంది నిజమా… లేక ప్రచారమా…

untitled-10

కాస్తోకూస్తో స్ట్రయిట్ ఫార్వడ్ గా ఉండే దర్శకుల్లో పూరి జగన్నాధ్ ఒకడు. మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాడు. తన సినిమాల్లో హీరోల్లానే, పూరి జగన్నాధ్ నిజజీవితంలో అలానే ఉంటాడు. అలాంటి పూరీ సడెన్ గా ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ ఒకేఒక్క స్టేట్ మెంట్ తో ఇజంపై అందరి దృష్టిపడేలా చేశాడు. అంచనాల్ని అమాంతం 10 రెట్లు పెంచేశాడు.

అవువు.. ఇంతకీ పూరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఏంటో తెలుసా.. తన సుదీర్ఘ కెరీర్ లో ఇజం సినిమాను ది బెస్ట్ మూవీగా చెప్పడమే సంచలనానికి కారణం. అవును… టాలీవుడ్ గతిని మార్చేసిన పోకిరి లాంటి ప్రభంజనాన్ని సృష్టించాడు పూరి. ఎన్టీఆర్ కు టెంపర్ లాంటి కమర్షియల్ హిట్ ను అందించాడు. మెగాభిమానులకు చిరుత లాంటి సూపర్ సెన్సేషన్ ను అందించాడు. అయితే వీటన్నింటి కంటే తన కెరీర్ లో బెస్ట్ మూవీ ఇజం అంటున్నాడు పూరి.

పూరి ఇలా మాట్లాడ్డంతో ఇజంపై నిజంగానే అంచనాలు పెరిగిపోయాయి. నిజంగానే ఇజం సినిమా కచ్చితంగా కొత్తగా ఉంటుందా… తెలుగు సినిమాలో ట్రెండ్ ను క్రియేట్ చేస్తుందా… కల్యాణ్ రామ్ కెరీర్ లోనే ఆల్ టైం హిట్ గా నిలుస్తుందా.. వెయిట్ అండ్ సీ…

Loading...

Leave a Reply

*