డ‌బ్బుల్లేక నాన్న మూడేళ్లు న‌న్ను,చెల్లిని హాస్ట‌ల్‌లో ఉంచాడు.. పూరి త‌న‌యుడు..!

akash

పూరి ఏది చేసినా సంచ‌ల‌న‌మే.. సెన్సేష‌న్‌కి ఆయ‌న కేరాఫ్‌. కెరీర్‌లో ఆయ‌న ఎన్నో ఎత్తుప‌ల్లాల‌ను చూశారు. ఎన్నో శిఖ‌రాల‌ను అధిరోహించారు. మ‌ళ్లీ అంతే ఎత్తునుంచి జారిప‌డ్డారు. ఇటీవ‌ల పూరి ఆర్ధికంగా నిల‌దొక్కుకున్నారు. ఆ మ‌ధ్య పూరిని కొంద‌రు మోసం చేశార‌ట‌. సుమారు 30 కోట్ల రూపాయ‌ల మేర ముంచార‌ట‌. ఈ విష‌యాన్ని పూరియే స్వ‌యంగా అంగీక‌రించారు. అదే అనుభ‌వంతో ఆయ‌న మ‌ళ్లీ పైకి లేచారు.

ఆ వ్య‌క్తిని పూరి విపరీతంగా న‌మ్మారట‌. త‌న ఆర్ధిక లావాదేవీల‌న‌న్నింటినీ ఆయ‌న‌కే అప్ప‌జెప్పాడ‌ట‌. పూరి మాత్రం ఆయ‌న మీద న‌మ్మ‌కంతో పూర్తిగా ఆయ‌న‌కే వ‌దిలేశార‌ట‌. స‌ద‌రు వ్య‌క్తి పూరికి చివ‌రికి లెక్క‌ల్లో పెద్ద బొక్క చూపించాడ‌నే మాట బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే, ఆ టైమ్‌లో పూరి క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. త‌న క‌న్న కొడుకు, కూతురికి ఈ కష్టాలు తెలియకూడ‌ద‌ని వారిని హాస్ట‌ల్‌లో ఉంచి చ‌దివించాడ‌ట‌. వారికి తెలిస్తే.. చ‌దువులు డిస్ట‌ర్బ్ అవుతాయ‌ని భావించిన పూరి జ‌గ‌న్నాధ్‌.. ఇలా చేశాడ‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా పూరి త‌న‌యుడు ఆకాష్ చెప్పాడు. మూడేళ్ల‌పాటు తాను, చెల్లెలు త‌ల్లిదండ్రుల‌కు దూరంగా ఉండి చ‌దువుకున్నామ‌ని, ఇదంతా ఓ వ్య‌క్తి చేసిన మోసం వ‌ల్లే అని చెప్పుకొచ్చాడు. ఇంత‌కీ ఆ వ్య‌క్తి ఎవ‌ర‌నేదే… హాట్ టాపిక్‌గా మారింది.

Loading...

Leave a Reply

*