హీరో ఫిక్స్ కాలేదు… సినిమా టైటిల్ క‌సాయి.. పూరీ క‌ష్టాలు…!

unnamed

టైటిల్స్ పెట్టడంలో పూరీని మించినోడు లేడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి టైటిల్స్ విషయంలో టాలీవుడ్ ను ఓ మలుపు తిప్పాడు ఈ దర్శకుడు. బడా హీరోలకు కూడా పోకిరి లాంటి టైటిల్స్ పెట్టి హిట్స్ ఇచ్చాడు. ఇడియట్, లోఫర్, టెంపర్ లాంటి టైటిల్స్ కూడా ఇతగాడివే. ఇప్పుడీ దర్శకుడు తాజాగా మరో టైటిల్ ఫిక్స్ చేశాడు. అదే కసాయి. ఇది మాత్రం నిజంగా నెగెటివ్ టైటిలే. ఎన్నో పాత సినిమాల్లో విలన్ ను హీరోయిన్లు ఇదే పేరుతో తిట్టేవారు. ఇలాంటి పేరును టైటిల్ గా పెట్టి, ఏ హీరోకు అప్పగిస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురూచూస్తున్నారు.

ప్రస్తుతానికి పూరి జగన్ చేతిలో ఎన్టీఆర్, మహేష్, లాంటి హీరోలున్నారు. మహేష్ సినిమాకు జనగణమన అనే టైటిల్ ను ఇప్పటికే ఫిక్స్ చేశాడు కాబట్టి మహేష్ బతికిపోయాడు. ఇక మిగిలింది ఎన్టీఆర్. తారక్ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. కొంపదీసి ఈ టైటిల్ ను యంగ్ టైగర్ సినిమాకే పెడతాడా ఏంటని నందమూరి ఫ్యాన్స్ తెగ భయపడుతున్నారు. అదే కనుక జరిగితే గట్టిగా వ్యతిరేకించాలని కూడా ఫిక్స్ అయ్యారు.

మరోవైపు రామ్ తో పూరి జగన్ ఓ సినిమా చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ సిిినిమాకు కథ, స్క్రీన్ ప్లే రాసుకునేందుకే పూరి.. బ్యాంకాక్ వెళ్లాడని అంతా అనుకుంటున్నారు. మరి ఈ సినిమాకు కసాయి అనే టైటిల్ పెట్టాడా అనేది తేలాల్సి ఉంది. మొత్తమ్మీద మొన్నటి లోఫర్ ఎంత వివాదాస్పదమైందో… ఈసారి కసాయి అనే పేరు అంతకంటే కాంట్రవర్సీ అవ్వడం ఖాయం.

Loading...

Leave a Reply

*