ఇజం సినిమాపై ఇన్ సైడ్ టాక్‌..!

ism

క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లోనే ప్రిస్టీజియ‌స్ మూవీ ఇది. ఆయ‌న కెరీర్‌లో ఇప్ప‌టిదాకా అప్‌క‌మింగ్ డైరెక్ట‌ర్‌లు, ఫ్లాప్ ద‌ర్శ‌కులతోనే సినిమాలు చేశాడు. బ‌డా డైరెక్ట‌ర్‌ల‌తో మూవీ చెయ్యలేదు. అలాంటిది తొలిసారిగా పూరి జ‌గ‌న్నాధ్ వంటి అగ్ర ద‌ర్శ‌కుడితో ఈ నంద‌మూరి హీరో ఓ మూవీకి క‌మిట‌య్యాడు. అదే ఇజం. ఈ నెల 21న విడుద‌లకు రెడీ అవుతోంది. బాలీవుడ్ భామ ఆదితి ఇజంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. క‌థ‌, క‌థ‌నంతోపాటు మాట‌లు కూడా పూరినే స‌మ‌కూర్చారు. జ‌ర్న‌లిజం బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతోంది ఇజం. ఈ సినిమాపై వినిపిస్తున్న ఇన్‌సైడ్ టాక్ ఇలా ఉంది.క‌ల్యాణ్ రామ్ ఓ న్యూస్ చానెల్ రిపోర్ట‌ర్‌గా ప‌నిచేస్తుంటాడట‌.

ప‌క్కా ఐడియాలజీతో క‌నిపించే సిన్సియ‌ర్ పాత్రికేయుడు. అనుకోకుండా చేసే ఓ స్టింగ్ ఆప‌రేష‌న్‌లో భ‌యంక‌ర నిజాలు బ‌య‌ట‌ప‌డ‌తాయట‌. దీంతో, క‌థ‌లో కొత్త ట్విస్ట్‌తో ఊహించ‌ని మ‌లుపుల‌తో ఆస‌క్తిక‌రంగా సాగుతుంద‌ట మూవీ. జ‌ర్న‌లిజం గొప్ప‌త‌నంతోపాటు, ఆ వృత్తిలోని లొసుగుల‌ని కూడా ఎత్తి చూపాడ‌ట పూరి జ‌గ‌న్నాథ్‌.ఇజం ఫ‌స్ట్ హాఫ్ మొత్తం స‌ర‌దా స‌ర‌దా స‌న్నివేశాల‌తో న‌డుస్తుంద‌ట‌. హీరో ల‌వ్ ట్రాక్‌తోపాటు ఎల‌క్ర్టానిక్ మీడియాలో జ‌రిగే సీన్స్ అన్నింటిని పూస‌గుచ్చిన‌ట్లు చూపించాడ‌ట పూరి. రొమాంటిక్ సీన్స్‌లో త‌న మార్క్ ల‌వ్ సీన్‌లతో బాగా ఎంట‌ర్‌ట‌యిన్ చేశాడ‌ట. పూరి బ్రాండ్ హీరో క‌ల్యాణ్‌రామ్‌లోనూ స్ప‌ష్టంగా క‌నిపిస్తాడ‌ట‌.

అయితే, అక్క‌డ‌క్క‌డ కాస్త కెమెరామెన్ గంగ‌తో రాంబాబుని త‌ల‌పించేలా ఉంటాయ‌ని స‌మాచారం. ఫ‌స్ట్ హాఫ్ వ‌ర‌కు సినిమా బావుంద‌ని, సో సోగా న‌డిచిపోతుంద‌ని స‌మాచారం.ఇక‌, సెకండాఫ్‌కి వ‌చ్చేస‌రికి సినిమా తేలిపోయింద‌నే టాక్ వినిపిస్తోంది. క‌థేంటో ఫ‌స్ట్ హాఫ్ ఇంట‌ర్‌వెల్‌లోనే తెలిసిపోతుందని, దీంతో, లాగ్ బాగా ఉన్న‌ట్లు ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇటు, సీరియ‌స్ స‌బ్జెక్ట్ అవ‌డం కూడా ఇజంని ముందుకి న‌డిపించ‌లేక‌పోయింద‌నే కామెంట్స్ వ‌స్తున్నాయి. మ‌రోవైపు, కామెడీ ట్రాక్ హిట్ అయితే, సినిమా మ‌రో రేంజ్‌కి వెళుతుంద‌ని, క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే చాన్స్ ఉంద‌ని స‌మాచారం. మ‌రి, ఇందులో నిజ‌మెంత అనేది సెన్సార్ టాక్ త‌ర్వాత తేలుతుంది.

Loading...

Leave a Reply

*