పాపం పూరి.. చివ‌రికి వారితో సినిమా చేస్తున్నాడు…!

puri

పూరికి ఇది నిజంగా ట‌ఫ్ టైమ్. మొన్న చిరంజీవి హ్యాండిచ్చాడు. నిన్న మ‌హేష్ నో చెప్పాడు. నేడు తార‌క్ కూడా ఆయ‌న‌కు దూరంగా జ‌రిగాడు. ఇలా వ‌ర‌స‌గా బ‌డా హీరోలంతా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు హ్యాండ్ ఇస్తుండ‌డంతో పూరికి పెద్ద దెబ్బ త‌గిలింది. దీంతో, పూరి క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. అగ్ర హీరోలంతా త‌న‌కు హ్యాండ్ ఇవ్వ‌డంతో త‌న‌ను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేష‌న్‌లో ప‌డిపోయాడు జ‌గ‌న్‌. అందుకే, ఆయ‌న అంతా కొత్త వారితో ఓ సినిమా షురూ చెయ్య‌నున్నాడ‌ని స‌మాచారం. దీనిపై ఇప్ప‌టికే ఆయ‌న త‌న ఫేవ‌రేట్ లొకేష‌న్ బ్యాంకాక్‌లో క‌థా చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

పూరికి క‌ష్టాలు కొత్త కాదు. ఆయ‌నకు గ‌తంలోనూ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. పూరి ప‌ని మటాష్ అనుకున్న టైమ్‌లో ఇడియెట్‌తో రెయిజ్ అయ్యాడు. ఆ త‌ర్వాత స‌క్పెస్‌లు వ‌చ్చాయి. మ‌ళ్లీ ఫ్లాప్‌లు రావ‌డంతో పూరి టాలీవుడ్‌లో నుంచి గోవిందా గోవిందా అన్నారు. కానీ, పోకిరితో ఆయ‌న బాక్సాఫీస్‌ని షేక్ చేశాడు. కానీ, ఈ సారి సీన్ డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ఆయ‌న‌కు బ‌డా హీరోలంతా చాన్స్‌లు ఇవ్వ‌డానికి ముందుకు వ‌చ్చారు. కానీ, అదే క‌థ‌, సేమ్ నారేష‌న్‌, ట్రీట్‌మెంట్‌తో విసిగించ‌డం మొద‌లుపెట్టాడు.

ఇజం క‌థ చాలా బావుంది. క‌ల్యాణ్‌రామ్‌ని కూడా కొత్త‌గా చూపించాడు. కానీ, ఏం లాభం..? నారేష‌న్‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం, రొడ్డ‌కొట్టుడు పూరి మార్క్ నారేష‌న్‌తో రొటీన్‌గా మార‌డంతో ఆ సినిమా ఆశించిన రేంజ్‌ని అందుకోలేకపోయింది. ఇదే పూరిని టాప్ ద‌ర్శ‌కుడి నుంచి టాప్ హీరోలంతా ప‌క్కకు జ‌రిగేలా చేసింద‌నే కామెంట్స్ ఉన్నాయి. మ‌రి, ఈ సారి అయినా పూరి మేజిక్ చేస్తాడా..? లేక‌, అదే ఫార్ములాతో విసిగిస్తాడా..? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

Loading...

Leave a Reply

*