పూరికి అత‌డే చివ‌రి ఆశ‌.. ఆ హీరో కూడా హ్యాండ్ ఇస్తే..?

untitled-6

ప్రస్తుతం పూరి జగన్నాద్ ఖాళీ. ఇజం సినిమా ఫెయిల్ అయిన తర్వాత ఎవరితో సినిమా చేద్దామా అని ఎదురుచూస్తున్నాడు. అటు ఎన్టీఆర్ కూడా ఖాళీగానే ఉన్నాడు. జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన తర్వాత.. ఆ సక్సెస్ ను అలానే కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఓ మంచి దర్శకుడి కోసం వెయిటింగ్. అయితే ఇప్పుడు పూరి ఆశన్నీ ఎన్టీఆర్ పైనే అని మీరు అర్థం చేసుకుంటే తప్పు. ఎందుకంటే.. పూరి ఇప్పుడు వేరే హీరోపై కన్నేశాడు.

ఇజం సినిమా సక్సెస్ అయితే కచ్చితంగా పూరి-తారక్ కాంబో మరోసారి వర్కవుట్ అయ్యేది. ఎట్ లీస్ట్ టెంపర్-2 అయినా వచ్చేది. కానీ ఇజం సినిమాను పూరి తన స్టయిల్ లో చుట్టేశాడు. కల్యాణ్ రామ్ ను ఫైనాన్షియల్ గా మరోసారి కిందకి తొక్కేయడంతో పాటు.. కెరీర్ పరంగా తన కూడా ఇబ్బందుల్లో పడ్డాడు. ఇలాంటి టైమ్ లో పూరికి అవకాశం ఇవ్వడం అంటే.. ఒక చేత్తో లైటర్ పట్టుకొని, ఇంకో చేయిని కాల్చుకోవడమే. అందుకే ఎన్టీఆర్ సైలెంట్ గా సైడ్ అయిపోయాడు.

దీంతో పూరి జగన్ ఇప్పుడు ఫోకస్ షిఫ్ట్ చేశాడు. ఇప్పటివరకు తను చేయని హీరోల లిస్ట్ ను మరోసారి తిరగేశాడు. అలా వెతకగా.. ఈ దర్శకుడికి హీరో రామ్ దొరికాడు. ఈమధ్యే రామ్ కు ఓ కథ వినిపించాడట పూరి. అటు రామ్ కూడా ఏ దర్శకుడితో సినిమా చేద్దామా అనే డైలమాలో ఉన్నాడు. ఎఁదుకంటే.. తాజాగా చేసిన హైపర్ పెద్దగా ఆడలేదు. అందుకే రామ్-పూరి ఇద్దరూ కనెక్ట్ అయినట్టు తెలుస్తోంది.

Loading...

Leave a Reply

*