నేను అక్కడ సెక్స్ చేయలేదు

untitled-8

తనపై కొన్నేళ్లుగా వస్తున్న ఆరోపణలు, అవాస్తవాలు, అపోహలు, భ్రమలపై ఎట్టకేలకు పూరి జగన్నాధ్ క్లారిటీ ఇచ్చాడు. ఇజం సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ దర్శకుడు బ్యాంకాక్ కనెక్షన్ పై ఓపెన్ గా తన మనసులో ఉన్నది చెప్పుకొచ్చాడు. అంతా అనుకుంటున్నట్టు తను సెక్స్ కోసమో, మసాజ్ ల కోసమో థాయ్ వెళ్లడం లేదని చెప్పాడు.

థాయిలాండ్ తనకు రెండో ఇల్లు లాంటిదని పూరీ చెబుతుంటాడు. స్క్రిప్ట్ రాసుకోవడానికి బ్యాంకాక్ కు తప్ప వేరే చోటికి పూరీ వెళ్ళడు. అయితే, కొంతమంది మాత్రం బ్యాంకాక్ లో బాగా ఎంజాయ్ చేయడానికే పూరీ జగన్నాథ్ వెళుతుంటాడని, అక్కడ థాయ్ అమ్మాయిలతో థాయ్ మసాజులు చేయించుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాడని, ఆ సుఖాల కోసమే పూరీ బ్యాంకాక్ కు వెళుతుంటాడని విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ విమర్శలకు పూరీ తనదైన స్టైల్లో సమాధానం చెప్పాడు.

చాలామంది వాళ్ళ ఊహలనే నిజాలు అనుకుంటూ ఉంటారని, కానీ నిజానికి నాకు ఏ థాయ్ అమ్మాయితో సెక్స్ అనుభవం లేదని ఓపెన్ గా చెప్పేశాడు. థాయ్ లాండ్ లో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ తనకు నచ్చుతాయని, అక్కడి ప్రజలు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారని, ఇక్కడి జనాల్లా మనస్సులో స్వార్థం కుళ్ళు పెట్టుకుని ఉండరని పూరీ జగన్నాథ్ అంటున్నాడు. ఈ రేంజ్ లో క్లారిటీ ఇచ్చాకైనా బ్యాంకాక్ గురించి ఆ కొంతమంది మాట్లాడటం మానేస్తే బాగుంటుందేమో.

Loading...

Leave a Reply

*