డియ‌ర్ నాగార్జున థాంక్‌యూ… మోదీ స్పెష‌ల్ విషెస్‌..!

modi

టాలీవుడ్ హీరో, మ‌న్మ‌ధుడు నాగార్జున‌కు ప్ర‌ధాన‌మంత్రి మోదీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. థాంక్‌యూ నాగార్జున అంటూ ఆయ‌న‌కు విషెస్ చెప్పారు. ఇంత‌కీ మేట‌ర్ ఏంట‌నుకుంటున్నారా…? ప్ర‌ధాన‌మంత్రి మోదీ నిన్న రాత్రి హ‌డావిడిగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అవినీతిని, బ్లాక్‌మ‌నీని నిరోధించేందుకు ఆయ‌న కొన్ని సంచ‌ల‌న స్టేట్‌మెంట్‌లు చేశారు. అంతే దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి ప‌డింది. ముఖ్యంగా బ‌డా బాబుల గుండెల్లో రైళ్లు ప‌రుగెట్టాయి.

దేశవ్యాప్తంగా చాలా మంది సెల‌బ్రిటీలు మోదీ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించారు. ఆయ‌న డేరింగ్ డెసిష‌న్ తీసుకున్నార‌ని, దేశ అభివృద్ధికి స‌రైన ముంద‌డుగు వేశారని కొనియాడారు టాలీవుడ్ హీరో నాగార్జున కూడా మోదీ నిర్ణ‌యాన్ని అభినందిస్తూ ట్వీట్ వేశారు. అందుకే, ప్ర‌తిగా థాంక్‌యూ నాగార్జున అంటూ రీ ట్వీట్ చేశారు నాగార్జున‌.

మోదీ నిర్ణ‌యాన్నిఅభినందిస్తూ నాగ్‌.. అభినంద‌న‌లు మోదీజీ..! ప‌న్ను చెల్లించే మాలాంటి వారిని స‌త్క‌రించినందుకు. ఆర్ధికంగా ఇండియా బ‌ల‌ప‌డే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఈ ట్వీట్‌కి సాయంత్రానికి మోదీ రీ ట్వీట్ చేశారు. థాంక్ యూ నాగార్జున‌… దీనివ‌ల్ల అవినీతి ఆగుతుంది. న‌ల్ల‌ధ‌నం, నకిలీ నోట్ల చెలామ‌ణి తగ్గుతుంది అని రీ ట్వీట్ చేశారు.

నాగార్జున‌కే కాదు.. మోదీ నిర్ణ‌యంపై ట్వీట్ చేసిన ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌, రితేష్ దేశ్‌ముఖ్‌, క‌ర‌ణ్ జోహార్ వంటి సెల‌బ్రిటీల‌కు కూడా రీ ట్వీట్‌లు చేశారు. ఇలా దాదాపు స్వ‌చ్ఛ‌భార‌త్ త‌ర్వాత మ‌రోసారి మోదీ నిర్ణ‌యాన్ని అంద‌రూ స్వాగ‌తించారు.

Loading...

Leave a Reply

*