సమంతకు ఎర్త్ పెట్టిన శృతిహాసన్…

sam

ఇప్పటికే సమంత-నాగచైతన్య కలిసి మూడు సినిమాలు చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే నాలుగో సినిమాకూడా ఈపాటికి వచ్చి ఉండేది. అవును.. ప్రేమమ్ సినిమాలో నాగచైతన్య-సమంత కలిసి మెరిసేవారే. కానీ ఆ కాంబినేషన్ ను అడ్డుకున్నది మాత్రం శృతిహాసన్. ప్రేమమ్ సినిమాలో సమంతకు చోటులేకుండా చేసింది ఈ కమల్ కూతురు.ప్రేమమ్ సినిమా ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దర్శకుడు చందు మొండేటి స్వయంగా ఈ విషయాన్ని నిర్థారించాడు. ప్రేమమ్ లో మడొన్నా పోషించిన పాత్ర కోసం సమంతానే అనుకున్నారట. అయితే అప్పటికే శృతిహాసన్ ను తీసుకున్నారు.

ఇలా ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లను తీసుకుంటే.. అంచనాలు పెరిగిపోతాయని… కథ, కథనం పక్కకు పోతాయనే ఉద్దేశంతోనే సమంతను తీసుకోలేదట.అప్పటికే శృతిహాసన్ ను తీసుకొని, ఆమెకు అడ్వాన్స్ కూడా ఇచ్చేయడంతో… సమంతకు హ్యాండ్ ఇవ్వక తప్పలేదంటున్నాడు దర్శకుడు చందు మొండేటి. అలా ప్రేమమ్ లో నటించే అవకాశాన్ని, సింధు అనే ఓ మంచి సెన్సిబుల్ క్యారెక్టర్ ను పోషించే ఛాన్స్ ను సమంత కోల్పోయిందంటున్నాడు. అయితే భవిష్యత్తులో చైతూ-సమంత కలిసి నటిస్తే చూడాలని ఉందని, వాళ్ల జంటను డైరక్ట్ చేసే ఛాన్స్ వస్తే వదులుకోనని కూడా అంటున్నాడు.

Loading...

Leave a Reply

*