ద‌స‌రా విజేత‌.. అక్కినేని బుల్లోడే..!

premam

ఈ విజ‌య‌ద‌శ‌మికి గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా ఏకంగా 5 సినిమాలు విడుద‌ల‌య్యాయి. గతంలో ఇంత‌టి వార్‌… కేవ‌లం పొంగ‌ల్ సీజ‌న్‌లో మాత్ర‌మే చూసేవాళ్లం. కానీ, ఈ ద‌స‌రా స్పెష‌ల్ ఏంటోకానీ, అయిదుగురు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఢీ అంటే ఢీ అంటూ పోటీకి సై అన్నారు. బాక్సాఫీస్ వార్‌కి పోటీలు ప‌డ్డారు. ప్రేమ‌మ్‌, ఈడు గోల్డ్ ఎహే, అభినేత్రి, మ‌న ఊరి రామాయ‌ణం, జాగ్వార్‌.. ఈ అయిదు చిత్రాలు ఈ న‌వ‌రాత్రి స్పెష‌ల్‌గా రేస్‌లోకి దిగాయి.ఈ అయిదింటిలో మొద‌టినుంచి అన్ని సినిమాల‌పైనా ఫోక‌స్ ఉంది. ఒక్కొక్క‌టి ఒక్కో డిఫ‌రెంట్ జాన‌ర్‌లో తెర‌కెక్కింది. ప్రేమ‌మ్ ఫుల్ లెంగ్త్ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్‌ట‌యిన‌ర్‌.

ఈడు గోల్డ్ ఎహే.. కామెడీ ఎంట‌ర్‌ట‌యిన‌ర్‌. అభినేత్రి.. స‌స్పెన్స్ హార‌ర్ కామెడీ, మ‌న ఊరి రామాయ‌ణం.. క‌థ‌, క‌థ‌నాన్ని న‌మ్ముకున్న‌ ఓ వైవిధ్య‌మైన చిత్రం, జాగ్వార్‌.. యాక్ష‌న్ మ‌సాలా మూవీ.. ఇలా డిఫ‌రెంట్ జాన‌ర్‌ల‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి.ఈ 5 చిత్రాలలో నాగ‌చైత‌న్య ప్రేమ‌మ్‌నే విజేత‌గా నిలిచిదంటున్నారు విమ‌ర్శ‌కులు, ట్రేడ్ పండితులు. కెరీర్‌లోనే చైతు ఓ డిఫ‌రెంట్ మూవీలో న‌టించ‌డం, మూడు భిన్న‌మైన పాత్ర‌ల‌లో ఆయ‌న మెప్పించ‌డం సినిమాకి బాగా క‌లిసి వ‌చ్చిందంటున్నారు. మూడు ప్రేమ‌క‌థ‌ల స‌మాహారంగా వ‌చ్చిన ప్రేమ‌మ్‌లో చైతు కెరీర్ బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇది మ‌రో అడ్వాంటేజ్‌.

శృతిహాస‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మ‌డొన్నా సెబాస్టియ‌న్ గ్లామ‌ర్ కూడా ప్రేమ‌మ్‌కి ప్ల‌స్ పాయింట్‌. ఇటు, చందూ మొండేటి డైరెక్ష‌న్ కూడా ప్రేమ‌మ్ స్థాయిని పెంచింది. రీమేక్ సినిమా అయినా ఒరిజిన‌ల్ క‌థ స్ఫూర్తిని మాత్ర‌మే తీసుకొని.. తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్లు మార్పులు చేర్పులు చేశాడు. దీంతో, ప్రేమ‌మ్ యూత్‌కి బాగా క‌నెక్ట్ అయింది.ఇక‌, సునీల్ ఈడు గోల్డ్ ఎహె, అభినేత్రి, మ‌న ఊరి రామాయ‌ణం వంటి చిత్రాల‌కు మంచి టాక్ వ‌చ్చినా క‌లెక్ష‌న్ల ప‌రంగా ప్రేమ‌మ్ మూవీనే విన్న‌ర్‌గా నిల‌వ‌డం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. మ‌రి, ప్రేమ‌మ్‌ ఎంత వ‌సూళ్లు చేస్తుందో అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Loading...

Leave a Reply

*