ఎన్టీఆర్‌పై ప్ర‌కాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్‌…!

ntr-and-prakash-raj

ఎన్టీఆర్‌-ప్ర‌కాష్ రాజ్‌కి మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్ద‌రి మ‌ధ్య న‌టులుగానే కాదు.. అంత‌కుమించిన రిలేష‌న్ ఉంది. అందుకే, ప్ర‌కాష్ రాజ్ తార‌క్‌ని ముద్దుగా వాడు, రేయ్ అని పిలుచుకుంటారు. అయితే, తార‌క్ న‌ట‌న‌పై ఆయ‌న ఇజ‌యం ఆడియో ఫంక్ష‌న్‌లో ప్ర‌కాష్ రాజ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపం గురించి స్పెష‌ల్‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ఎలాంటి న‌టుడో ఇప్ప‌టికే ప‌లు సినిమాల‌తో, పాత్ర‌ల‌తో ప్రూవ్ చేశాడు. పౌరాణిక పాత్ర‌లతోనూ మెప్పించాడు. అయితే, ఇజ‌మ్ ఆడియో ఫంక్ష‌న్‌లో తార‌క్ న‌ట‌న‌పై ప్ర‌కాష్ రాజ్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. త‌న‌లాంటి గొప్ప‌ న‌టుడిని కూడా ఇంప్రెస్ చేసేస‌త్తా ఉన్న న‌టుడని ఆయ‌నని ఆకాశానికెత్తేశాడు. మొన్నీమ‌ధ్య ఆయ‌న తాను ఎంత‌టి గొప్ప న‌టుడో ఇటీవ‌ల ఓ ఇంట‌ర్‌వ్యూలో చెప్పాడు. ప్ర‌కాష్ రాజ్ లాంటి న‌టులు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి దొర‌క‌డం అరుదు. అలాంటి ప్ర‌కాష్ రాజ్‌.. నంద‌మూరి యువ హీరో యాక్టింగ్ స్కిల్స్‌ను మెచ్చుకోవ‌డం సాధార‌ణ విష‌యం కాదు.

ఆడియో ఫంక్ష‌న్‌ల‌లో ఇలాంటి మాట‌లు సాధార‌ణ‌మే అనుకోవ‌చ్చు. కానీ, ప్ర‌కాష్ రాజ్ త‌న మ‌న‌సుకు న‌చ్చ‌ని మాట‌లు ఎప్పుడూ చెప్ప‌డు. త‌న‌కు ఏది న‌చ్చితే అదే మాట్లాడ‌తారు. ఇలా, మ‌రో హీరో గురించి మాట్లాడ‌డం చాలా రేర్‌. ఇదే ఇప్పుడు యంగ్ టైగ‌ర్ అభిమానులను ఫుల్‌జోష్‌లో ముంచెత్తుతోంది. జ‌న‌తా గ్యారేజ్ స‌క్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న తార‌క్ ఫ్యాన్స్‌కు ఇది మ‌రో గుడ్ న్యూస్‌.

Loading...

Leave a Reply

*