సినిమా ఫ్లాప్.. కానీ అందరికీ గిఫ్ట్ లు ఇచ్చాడు…

prabhu

ఓ సినిమా హిట్ అయితే.. దానికి పనిచేసిన టెక్నీషియన్లు, నటీనటులకు నిర్మాతలు గిఫ్టులు ఇవ్వడం ఇప్పుుడు కామన్ అయిపోయింది. మొన్నటికి మొన్న జనతా గ్యారేజ్ హిట్ అయితే.. ఏకంగా కాస్ట్ లీ ఇల్లు ఒకటి కొరటాలకు బహుమతిగా ఇచ్చాడు ఎన్టీఆర్. అంతకంటే ముందు శ్రీమంతుడు సక్సెస్ అయితే.. ఓ బెంజ్ కారునే కొరటాలకు గిఫ్ట్ గా ఇచ్చాడు మహేష్. బాహుబలి హిట్ అయినప్పుడు.. యూనిట్ లో ప్రతి ఒక్కరికి ఖరీదైన బహుమతులు అందాయి. ఇలా సినిమా హిట్ అయినప్పుడు బహుమతుల ద్వారా ఆ ఆనందాన్ని పంచుకునే కల్చర్ ను షారూక్, సల్మాన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడా కల్చర్ ను కొత్త మలుపు తిప్పాడు ప్రభుదేవా.

కొరియోగ్రాఫర్ కమ్ డైరక్టర్ గా ఇప్పటికే పేరుతెచ్చుకున్న ప్రభుదేవా… తాజాగా నిర్మాతగా కూడా మారాడు. సొంత డబ్బులు పెట్టి తమన్నను లీడ్ రోల్ గా పెట్టి అభినేత్రి సినిమా తీశాడు. ఈ సినిమాలో ప్రభుదేవా కూడా ఓ క్యారెక్టర్ పోషించాడు. తెలుగు-తమిళ-హిందీ భాషల్లో ఒకేసారి అభినేత్రి విడుదలైంది. అయితే 3 భాషల్లో ఒకేసారి విడుదలవ్వడం వల్ల ప్రచారంలో ప్లానింగ్ లేకపోవడం వల్ల… ప్రతి భాషలో ఇది యావరేజ్ గానే ఆడింది. తెలుగులో అయితే ఇది ఫ్లాప్ అనే చెప్పాలి.

ఇంత జరిగిన తర్వాత కూడా ప్రభుదేవా తగ్గలేదు. తన సినిమాను సక్సెస్ చేశాడంటూ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ కు ఆడి కారును బహుమతిగా అందించాడు. అంతేకాదు.. త్వరలోనే సోనూసూద్, తమన్న లాంటి నటులకు కూడా ఖరీదైన బహుమతులు పంపించబోతున్నాడట. అదేంటి ఫ్లాప్ అయిన సినిమాకు గిఫ్ట్ లు అని ఆలోచిస్తున్నారా… సినిమా ఫ్లాప్ అయినా ప్రభుదేవాకు బాగానే డబ్బులొచ్చాయని టాక్. అందుకే ఇదంతా..

Loading...

Leave a Reply

*