గుడ్ న్యూస్ చెబుతున్న యంగ్‌రెబ‌ల్ స్టార్‌..!

prabhs

ప్ర‌భాస్ నుంచి గుడ్ న్యూస్ అంటే ఇప్పుడు పెళ్లి వార్తే. ఎందుకంటే, టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే తిరుగులేని రికార్డ్ నెల‌కొల్పాడు బాహుబ‌లి. ఇండియాలోనే ఆల్‌టైమ్ థ‌ర్డ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది బాహుబ‌లి. ఇక‌, బాహుబ‌లి 2తో వెయ్యి కోట్ల మార్కెట్‌పై క‌న్నేశాడు యంగ్ రెబ‌ల్ స్టార్‌. అయితే, ప్ర‌భాస్ చెప్పాల‌నుకుంటున్న గుడ్ న్యూస్ త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ గురించి కాదు.. కెరీర్‌కి సంబంధించి.ప్ర‌భాస్‌.. టాలీవుడ్ టాప్ హీరో. వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్న యంగ్ రెబ‌ల్ స్టార్‌.. గ‌త నాలుగేళ్లుగా ఒక్క బాహుబ‌లి ద‌గ్గ‌రే ఆగిపోయాడు.

2013 ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల‌యిన మిర్చి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించింది బాహుబ‌లిలోనే. ఆ తర్వాత ఆయ‌న మ‌రో సినిమాకి క‌మిట్‌కాలేదు. బాహుబ‌లితో ప్ర‌భాస్‌కి నేష‌న‌ల్ వైడ్ పాపులారిటీ ద‌క్కింది. అయితే, త్వ‌ర‌లోనే బాహుబ‌లి 2 నుంచి ఆయ‌న బ‌య‌ట‌కు రాబోతున్నాడు. న‌వంబ‌ర్ ఎండింగ్‌కి బాహుబ‌లి 2 షూటింగ్ అయిపోతుంది. ఆ త‌ర్వాత ఆయన చెయ్య‌బోయే సినిమాల‌కు సంబంధించి ఇప్ప‌టినుంచే ప‌క్కా ప్లానింగ్‌తో ఉన్నాడు ప్ర‌భాస్‌.బాహుబ‌లి షూటింగ్ అయిపోయిందో లేదో.. వెంట‌నే ప్ర‌భాస్ మ‌రో రెండు సినిమాల‌కు సైన్ చెయ్య‌నున్నాడు.

ర‌న్ రాజా ర‌న్ ద‌ర్శ‌కుడు సుజీత్‌తో ఆల్రెడీ ఓసినిమాకి సైన్ చేశాడు. ఇటు, జిల్ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌కి ఓ మూవీకి ప‌చ్చజెండా ఊపాడు. ఈ రెండు చిత్రాల‌ను త‌క్కువ టైమ్‌లోనే షురూ చెయ్యాల‌నేది ప్ర‌భాస్ ప్లాన్. సుజీత్ సినిమాకి వ‌చ్చే నెల ఎండింగ్‌కి.. అంటే అక్టోబ‌ర్ ఎండింగ్‌కి సినిమా షురూ చెయ్యాల‌ని ప్లాన్ చేస్తున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్‌. వీల‌యితే, ఈ సినిమాని బాహుబ‌లి 2 విడుద‌ల‌యిన నెల‌న్న‌ర గ్యాప్‌లోనే విడుద‌ల‌య్యేలా స్కెచ్ రెడీ చేశాడ‌ట ప్ర‌భాస్‌. ఇది యంగ్ రెబ‌ల్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ క‌దా..

Loading...

Leave a Reply

*