డార్లింగ్ నా బ‌ర్త్‌డేకి రండి.. టాలీవుడ్ టాప్ హీరోల‌కి ప్ర‌భాస్‌కి ఆహ్వానం..!

prabhas-inviting-tollywood-top-heroes-to-his-birthday-on-oct23

అక్టోబ‌ర్ 23.. ప్ర‌భాస్ పుట్టిన‌రోజు.. ఈ బ‌ర్త్ డే ఆయ‌న‌కు వెరీ వెరీ స్పెష‌ల్‌. మూడేళ్లుగా బాహుబ‌లి మీదే ఫోక‌స్ పెట్టాడు. బాహుబ‌లి సంచ‌ల‌నం క్రియేట్ చేసింది. ఇక‌, బాహుబ‌లి 2 షూటింగ్ పూర్తి కావొచ్చింది. దీంతో, గ్రాండ్‌గా పార్టీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడ‌ట ప్ర‌భాస్‌. ఇండ‌స్ట్రీలోని టాప్ మోస్ట్ హీరోల‌ను, హీరోయిన్‌ల‌ను అంద‌రినీ పిలిచి భారీగా సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నాడట ఛ‌త్ర‌ప‌తి హీరో.

ప్ర‌భాస్ ఫ్రెండ్స్‌కి పార్టీలివ్వ‌డం కొత్త‌కాదు. బాహుబ‌లి స‌క్సెస్ త‌ర్వాత పార్టీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత త‌న డ్రీమ్ కారు కొన్న టైమ్‌లోనూ బాహుబలి త‌న ఆనందాన్ని ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నాడు. కానీ, ఈసారి ఇవ్వ‌బోయే పార్టీ అలాంటి ఇలాంటిది కాదు. గ్రాండ్ పార్టీ. ఎందుకంటే, తాజాగా ప్ర‌భాస్ మైన‌పు బొమ్మ‌ను టుస్సాడ్ మ్యూజియంలో పెడుతున్నారు. ఇది చాలా అరుదైన ఘ‌న‌త‌. ఇప్ప‌టిదాకా ఆ మ్యూజియంలో కేవ‌లం భార‌త సంత‌తికి చెందిన ఇద్ద‌రు వ్య‌క్తుల విగ్ర‌హాల‌నే అధిష్టించారు. అందులో ఒక‌రు మ‌హాత్మాగాంధీ. మ‌రొక‌రు న‌రేంద్ర మోదీ. ఈ ఇద్ద‌రు త‌ర్వాత టుస్సాడ్ మ్యూజియంలో కొలువు దీర‌బోతున్న భార‌త విగ్ర‌హం ప్ర‌భాస్‌దే. ఇలా అరుదైన ఫీట్ సాధించ‌డంతో దానిని సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని భావిస్తున్నాడ‌ట ప్ర‌భాస్‌.

అందుకే, త‌న ఈ స్పెష‌ల్ బ‌ర్త్‌డేకి టాలీవుడ్ టాప్ హీరోల‌ను, హీరోయిన్‌ల‌ను ఆహ్వానించాల‌ని భావిస్తున్నాడ‌ట‌. త‌న కెరీర్‌లో ఇదే లాస్ట్ బ్యాచిలర్ బ‌ర్త్ డే పార్టీ అవుతుంద‌ని భావిస్తున్న ప్ర‌భాస్‌… మ‌హేష్‌, ఎన్టీఆర్‌, బ‌న్ని, చెర్రీతోపాటు ఇతర మెగా హీరోలు, అక్కినేని హీరోల‌ను ఇన్వ‌యిట్ చెయ్యాల‌ని ఆలోచిస్తున్నాడ‌ట‌. ఈ దిశ‌గా కొంద‌రికి అప్పుడే ఫోన్‌లు కూడా చేశాడ‌ని స‌మాచారం. మ‌రి, ఆయ‌న బ‌ర్త్‌డే పార్టీకి ఎవ‌రెవ‌రు వ‌స్తారో చూడాలి.

Loading...

Leave a Reply

*