వాళ్ల‌ని చెంపదెబ్బ కొట్టాడ‌ట ప్ర‌భాస్‌..!

prabhas

అవార్డ్ రాయుళ్ల‌కు ప్ర‌భాస్ చెంపదెబ్బ కొట్టినంత ప‌ని చేశారు. టాలీవుడ్‌లోనే కాదు.. జాతీయ స్థాయిలో బాహుబ‌లి క్రియేట్ చేసిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఈ సినిమా ఏకంగా 650కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసింది ఇండియాలో. ఇది ఓ రికార్డ్‌. దీనిసంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. జాతీయ ఉత్త‌మ చిత్రంగా కూడా అవార్డ్ ద‌క్కించుకుంది.టాలీవుడ్‌లోనూ ఈ సినిమాకి బోలెడు అవార్డ్‌లు ద‌క్కాయి. ఎన్నో అవార్డ్‌ల‌ను కైవ‌సం చేసుకుంది బాహుబ‌లి. అయితే, అన్నింటిలోనూ ప్ర‌భాస్‌కి ఒక్క అవార్డ్ కూడా రాక‌పోవ‌డం బాధించింద‌నే టాక్ వినిపించింది. బెస్ట్ విల‌న్‌, బెస్ట్ కేర‌క్ట‌ర్ ఆర్టిస్ట్‌, ఉత్త‌మ సహాయ‌న‌టి, బెస్ట్ మ్యూజిక్‌, బెస్ట్ కొరియోగ్ర‌ఫీ, బెస్ట్ సినిమాటోగ్ర‌ఫీ, బెస్ట్ గ్రాఫిక్స్‌.. ఇలా ఎన్నో ది బెస్ట్‌ల‌ను గెలుచుకున్న బాహుబ‌లికి ఏ ఒక్క అవార్డ్ ఫంక్ష‌న్‌ల‌లోనూ ప్ర‌భాస్‌కి ఉత్త‌మ‌న‌టుడిగా అవార్డ్ రాక‌పోవ‌డం విశేషం.ఇప్పుడు అన్ని అవార్డ్‌ల కంటే.. ది బిగ్గెస్ట్‌గా భావించే గిఫ్ట్ ఒక‌టి ప్ర‌భాస్‌కి ద‌క్కింది.

మేడ‌మ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్ర‌భాస్ బాహుబ‌లి మైనపు బొమ్మ‌ను ఏర్పాటు చేస్తున్నారు. బ్యాంకాక్‌లో ఇది కొలువు దీర‌నుంది. మ‌హాత్మాగాంధీ, ప్ర‌ధాని మోదీ త‌ర్వాత ఈ అరుదైన ఘ‌న‌త ద‌క్కించుకుంది ప్ర‌భాసే. బాహుబ‌లిలోని ఆయ‌న ఇమేజ్‌కి, న‌ట‌నకి ద‌క్కిన ప్ర‌శంస ఇది. ఇంత‌కంటే ఓ నటుడికి మించిన అవార్డ్ ఏమ‌న్నా ఉంటుందా..? అందుకే, టుస్సాడ్ మ్యూజియంలోని మైన‌పు బొమ్మ‌తో ప్ర‌భాస్ అవార్డ్ రాయుళ్ల‌కు చెంపదెబ్బ కొట్టినంత ప‌నిచేశాడ‌ని..? ఇప్పుడు ఆయ‌న‌కు వారు ఏం స‌మాధానం చెబుతార‌ని ప్ర‌శ్నిస్తున్నారు ప్ర‌భాస్ అభిమానులు. టాలీవుడ్‌లోని అవార్డ్‌ల‌న్నీ ముందే డిసైడ్ అయిపోతాయ‌ని, అలాంటి వాటి గురించి తాము ప‌ట్టించుకోవాల్సిన అవ‌సరం లేద‌ని అంటున్నారు. టుస్సాడ్‌తో మైన‌పు బొమ్మ‌తో త‌మ హీరో రేర్ ఫీట్ సాధించాడ‌ని, ఇది చాల‌ని ఇంత‌కంటే అరుదైన గౌర‌వం ఏముంటుంద‌ని బౌన్స‌ర్‌లు వేస్తున్నారు. వాళ్ల‌ని చెంపదెబ్బ కొట్టాడ‌ట ప్ర‌భాస్‌..!

Loading...

Leave a Reply

*