ప్రభాస్ ఫ్రెండ్స్ కి అంత ధైర్యమా…

sujith

తెలుగులో యూవీ క్రియేషన్స్ బ్యానర్ కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మిర్చి సినిమాతో నిర్మాతలుగా మారిన ప్రభాస్ ఫ్రెండ్స్… ఆ తర్వాత తాము పట్టిందల్లా బంగారం అనిపించుకున్నారు. ఏ సినిమా చేసినా దాంతో హిట్ అందుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ప్రభాస్ తోనే మిర్చి తర్వాత మరో మూవీ ప్లాన్ చేస్తున్నారు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు. అయితే ఈసారి వీళ్లంతా కలిసి చేతులు కాల్చుపోవడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.

బాహుబలి లాంటి బడా మూవీ తర్వాత యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సుజీత్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా హిట్ అయిపోయింది కాబట్టి.. తమ నెక్ట్స్ సినిమాను కూడా వీళ్లు అంతే భారీగా ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ కోసం ఏకంగా 150కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. భారీ ఎమౌంట్ ఇచ్చి పరిణీతి చోప్రాను హీరోయిన్ గా తీసుకున్నారట. సినిమాలో ఓ ఫైట్ సీక్వెన్స్ కోసం ఏకంగా 30కోట్ల రూపాయలు ఖర్చుపెట్టబోతున్నారట.

ఆకాశంలో ఆ ఫైట్ వస్తుందంటున్నారు.ఇలా బాహుబలి సినిమాను దృష్టిలో పెట్టుకొని, ప్రభాస్ నెక్ట్స్ మూవీ బడ్జెట్ ను ఈ నిర్మాతలు అమాంతం పెంచేస్తున్నారు. మరోవైపు సుజీత్ అనే దర్శకుడు కేవలం ఒకేఒక్క సినిమా మాత్రమే చేశాడు. దీంతో ఈసారి యూవీ క్రియేషన్స్ బ్యానర్ కు ఝలక్ తప్పదని చాలామంది భావిస్తున్నారు.

Loading...

Leave a Reply

*