సింగం సీక్వెల్ లో బాహుబలి

prabhas-and-surya

ఎక్కడ్నుంచి ఎలా వచ్చిందో తెలీదు గాని, ప్రస్తుతం ఓ న్యూస్ అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదేంటంటే.. తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలో మన బాహుబలి ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపిస్తాడట. అసలు విషయంలోకి వెళితే, సూర్య మరోసారి తనదైన మాస్ యాక్షన్ చూపించడానికి ప్రస్తుతం సింగం-3 సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. హరి దర్శకత్వంలో సూర్యకు జోడీగా అనుష్క, శృతిహాసన్ లు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. అంతేకాకుండా ‘సింగం-3’ సినిమాను ఈ డిసెంబర్ 16న రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించేశారు కూడా.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్టుండి ఈ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్నాడనే న్యూస్ రావడం ఆసక్తికరంగా మారింది. బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ నిజంగా అతిథి పాత్రలో అలరిస్తే మాత్రం అది ఖచ్చితంగా సింగం-3కు స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. అసలు ఈ న్యూస్ ఎంతవరకు నిజం అనే డౌట్ వస్తే మాత్రం.. ఇంట్రెస్ట్ కొద్దీ సూర్య స్వయంగా అడిగితే, ఫ్రెండ్ షిప్ కొద్దీ ప్రభాస్ హ్యాపీగా ఓకే చెప్పేశాడనే వాదన గట్టిగా వినిపిస్తుంది. ఇప్పటికే బాహుబలితో తమిళ ప్రేక్షకులకు దగ్గరైపోయిన ప్రభాస్ ఇప్పుడు సింగం-3 లో నిజంగా మెరిస్తే.. అది ప్రభాస్ కు కూడా బాగానే కలిసొస్తుంది.

Loading...

Leave a Reply

*