ఆ పుకారుపై క్లారిటీ ఇచ్చాడు…

rajamouli

బాహుబలి ప్రాజెక్టుకు సంబంధించి నటీనటుల్లో అంతా మిగతా ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయారు. రానా అయితే ఒకేసారి రెండు సినిమాలు షురూ చేశాడు. ఘజి మూవీతో పాటు తేజ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చాడు. తమన్న కూడా ఈ దసరాకే అభినేత్రి మూవీని సిద్ధం చేసింది. అటు అనుష్క కూడా భాగమతి సినిమాతో పాటు సింగం-3లో నటిస్తోంది. ఇలా కీలకమైన నటీనటులంతా మిగతా ప్రాజెక్టులు చేసుకుంటున్నారు. ప్రభాస్ ఒక్కడు తప్ప.బాహుబలి-2 కంప్లీట్ అయ్యేంత వరకు ప్రభాస్ కు విముక్తి లేదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ విముక్తి ఎప్పుడనేది మాత్రం ఇప్పటివరకు ఎవరీ స్పష్టత లేదు.

ఎట్టకేలకు ఈ అంశంపై రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. ఈ ఏడాదితో బాహుబలికి ప్రభాస్ కు మధ్య బంధం తెగిపోతుందన్నాడు. డిసెంబర్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని.. ఆ తర్వాత ప్రభాస్ ను వదిలేస్తానంటున్నాడు. డిసెంబర్ 2 లేదా మూడో వారానికల్లా ప్రభాస్ తో పాటు నటీనటులందరూ రిలీజైపోతారని రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు.బాహుబలి ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేంతవరకు ప్రభాస్ మరో సినిమాకు పనిచేయకూడదంటూ నిర్మాతలు కండిషన్లు పెట్టారని, ఆ మేరకు అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి.

దీనిపై ప్రభాస్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు. నిజానికి బాహుబలి-1 తర్వాత తనకు ఫ్రీ టైం దొరికిందన్నాడు. ఏకంగా 4 నెలల పాటు తనకు ఖాళీ దొరికిందని… కావాలనుకుంటే ఆ సమయంలో ఇంకో సినిమా చేసుకోవచ్చని రాజమౌళితో పాటు నిర్మాతలు కూడా తనకు ఓకే చెప్పారని.. కానీ తనే చేయలేదన్నాడు ప్రభాస్. ఓ మహాసముద్రం మధ్యలో చిన్న నదుల్ని ఎందుకు వదలడం అనే ఉధ్దేశంతో… మరో సినిమా చేయలేదని ప్రభాస్ స్పష్టం చేశాడు. దీంతో ఇన్నాళ్లూ ఉన్న రూమర్లకు చెక్ పడింది.

Loading...

Leave a Reply

*