హాట్ సెన్సేషన్ ను నెట్ సెన్సేషన్ కలిశాడు…

poonam

ఒకరేమో వెండితెరపై హాట్. ఆమె వీడియోలు, ఫొటోలు పిచ్చెక్కిస్తాయి. ఆమె పేరు పూనమ్ పాండే. మరొకరు నెట్ లో సెన్సేషన్. అతడే సంపూర్ణేష్ బాబు. ఇప్పుడీ రెండు హాట్ లు కలిశాయి. అవును.. సంపూ హీరోగా, పూనమ్ పాండే హీరోయిన్ గా మాంఛి మసాలా సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఇది ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.పూనమ్ పాండే లీడ్ రోల్ లో హిందీ-తెలుగు భాషల్లో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది.

అయితే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ఏదో మిస్ అయిందనే ఫీలింగ్ వచ్చిందట మేకర్స్ కు. అంతే వెంటనే సంపూర్ణేష్ బాబును హీరోగా తీసుకున్నారు. పూనమ్ అందాలకు సంపూ పంచ్ లు తోడైతే సినిమా కెవ్వుకేక అంటున్నారు.ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. దీంతో వెంటనే పూనమ్ పాండే ఒళ్లో వాలిపోయాడు. వచ్చేనెల నుంచి పూనమ్ పాండే, సంపూల మధ్య రొమాంటిక్ సన్నివేశాల్ని పిక్చరైజ్ చేస్తాడట.

Loading...

Leave a Reply

*