పోకిరి, టెంపర్ మధ్యలో పూరి

puri

ఇజం సినిమా పని దాదాపు అయిపోయింది. ఈనెల మూడో వారంలో సినిమాను విడుదల చేసే ఛాన్స్ ఉంది. అయితే కల్యాణ్ రామ్ తో చేస్తున్న ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాధ్ ఎవరితో కలిసి సెట్స్ పైకి వెళ్తాడనే చర్చ హాట్ హాట్ గా సాగుతోంది. ఎందుకంటే.. అటు మహేష్ బాబు, ఇటు ఎన్టీఆర్ ఇద్దరూ పూరితో సినిమాలు చేసేందుకు కమిట్ అయ్యారు. వీళ్లలో ఎవరి సినిమా ఫస్ట్ సెట్స్ పైకి వస్తుందనే విషయంలో పూరికి కూడా క్లారిటీ లేదు.

కొన్ని రోజులు విశ్రాంతి తీసుకునేందుకు తన స్వగ్రామానికి వెళ్లిన జగన్… అక్కడి స్థానిక రిపోర్టర్లతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన అప్ కమింగ్ మూవీస్ గురించి చెప్పుకొచ్చాడు. మహేష్ తో జనగణమన, ఎన్టీఆర్ తో మరో సినిమా రెండూ సిద్ధంగా ఉన్నాయంటున్నాడు ఈ స్టార్ దర్శకుడు. మహేష్ జనగణమన సినిమా కథను ఎప్పుడో పూర్తిచేశానని, తాజాగా ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం మరో కథను కూడా సిద్ధం చేశానని అంటున్నాడు.

ప్రస్తుతానికి పూరితో సినిమా చేసే పొజిషన్ లో మహేష్ లేడు. ఎందుకంటే.. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న మహేష్… ఆ వెంటనే కొరటాలతో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. సో.. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ తో సినిమా ఓకే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే.. ప్రస్తుతానికి తారక్ ఏ సినిమాకు కమిట్ మెంట్ ఇవ్వలేదు.

Loading...

Leave a Reply

*