ఆ నాలుగో సినిమా ఏంటబ్బా…

untitled-51

వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయింది. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి దూకాలని పవన్ సిద్ధమైపోయాడు. అందుకే వీలైనంత త్వరగా అనుకున్న కమిట్ మెంట్స్ ను పూర్తిచేయాలని అనుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఎన్నికలకు వెళ్లేలోపు 4 సినిమాలు పూర్తిచేయాలని పవన్ అనుకుంటున్నాడట. ఆ 4 సినిమాలతోనే కెరీర్ కు కామా పెట్టాలని భావిస్తున్నాడట.సర్దార్ గబ్బర్ సింగ్ పరాజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రం కాటమరాయుడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని 2017 ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

దీని తరువాత పవన్ తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చిత్రాన్ని మొదలుపెడతాడు. ప్రస్తుతానికి ఈ రెండు సినిమాలు పక్కా అయ్యాయి.ఇక మూడో సినిమాగా ఎఎమ్ రత్నం బ్యానర్ శ్రీ సూర్య మూవీస్ పతాకంపై ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఎన్నాళ్ల నుంచో ఏఎమ్ రత్నం పవన్ చుట్టూ తిరుగుతున్నాడు. పవన్ కూడా ఓ తమిళ డైరక్టర్ చెప్పిన కథకు ఓకే చేసినట్టు తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉంది గానీ… పవన్ చెప్పిన 4 సినిమాల కోటాలో ఆ నాలుగో సినిమా ఎవరితో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Loading...

Leave a Reply

*