ఫ్యాన్స్ ను ఆశ్చర్యంలో ముంచెత్తిన పవన్…

pawan

పవన్ ఇండస్ట్రీకొచ్చి దాదాపు 15 ఏళ్లు అయింది. ఈ 15 ఏళ్లలో ఎప్పుడూ చేయని పనిని, పవన్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాడు. కనీసం ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని పని అది. అసలు పనవ్ కూడా ఈ పని చేయగలడా అనిపించే స్థాయిలో ఉంటుందా పని. ఆ పనిని పవన్ ప్రారంభించబోతున్నాడు.  ఆ పని మరేదో కాదు… ఒకేసారి 2 సినిమాలు స్టార్ట్ చేయడం. అవును.. కెరీర్ లో ఫస్ట్ టైం ఒకేసారి రెండు సినిమాల్ని షూట్ చేయబోతున్నాడు పవన్.

ప్రస్తుతం పవన్.. కాటమరాయుడు అనే సినిమా చేస్తున్నాడు. అటు త్రివిక్రమ్ తో కూడా సినిమా చేస్తానని మాటిచ్చాడు. అయితే కాటమరాయుడు ప్రాజెక్టు… అనుకున్న టైమ్ కంటే కాస్త ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లింది. దీంతో త్రివిక్రమ్ సడెన్ గా ఖాళీ అయిపోయాడు. అందుకే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ప్రస్తుతం చేస్తున్న కాటమరాయుడుతో పాటు త్రివిక్రమ్ మూవీని కూడా సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నాడట. తాజా ప్లానింగ్ ప్రకారం… నవంబర్ లో త్రివిక్రమ్ సినిమాకు పవన్ 15 రోజులు కాల్షీట్లు ఇచ్చాడని టాక్. ఇలా ఒకేసారి రెండు సినిమాల్ని కంప్లీట్ చేయాలనేది పవన్ ప్లాన్. కెరీర్ లో ఎప్పుడూ పవన్ ఇలా చేయలేదు.

పవన్ ఈ డెసిషన్ తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఫుల్ లెంగ్త్ పాలిటిక్స్ లోకి వెళ్లాలనుకుంటున్నాడు. అందుకే ఒప్పుకున్న సినిమాల్ని వీలైనంత తొందరగా పూర్తిచేయాలనుకుంటుున్నాడు. కాటమరాయుడు ప్రాజెక్టుతో పాటు త్రివిక్రమ్ మూవీని కూడా ఒకేసారి చేయడానికి కారణం ఇదే అంటున్నారు చాలామంది.

Loading...

Leave a Reply

*