మరోసారి అదే సెంటిమెంట్ ఫాలో అవుతాడా…?

pawan

పవన్ సినిమాకు సంబంధించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ రూమర్ హల్ చల్ చేస్తోంది. గోపాల గోపాల తర్వాత మరో మల్టీస్టారర్ చేయని పవన్ కల్యాణ్.. ఈసారి కాటమరాయుడులో మాత్రం మల్టీస్టారర్ ను రిపీట్ చేస్తాడట. అది కూడా స్వయంగా మహేష్ బాబును రంగంలోకి దించుతున్నాడట. అయితే తెరపై మాత్రం ఈ బడా స్టార్లు ఇద్దరూ కనిపించరు. సింపుల్ గా చెప్పాలంటే జల్సా సెంటిమెంట్ ను రిపీట్ చేయాలనుకుంటున్నాడట పవన్.త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమాలో తెరపై పవన్ కనిపిస్తాడు.

కానీ తెరవెనక మాత్రం కొన్నిచోట్లమహేష్ వాయిస్ వినిపిస్తుంది. సినిమాకు అది బాగా ప్లస్ అయింది. అప్పట్లో త్రివిక్రమ్ పై ఉన్న ఫ్రెండ్ షిప్ కొద్దీ ఆ పనిచేశాడు మహేష్. ఇప్పుడు కాటమరాయుడు కోసం కూడా అదే సెంటిమెంట్ రిపీట్ చేయాలనుకుంటున్నాడట పవన్. కుదిరితే తన కొత్త సినిమాకు కూడా మహేష్ తో వాయిస్ ఓవర్ ఇప్పించాలని అనుకుంటున్నాడట.

అయితే గతంలో త్రివిక్రమ్ వల్ల మాత్రమే మహేష్ ఆపనికి ఒప్పుకున్నాడు. ఆమధ్య బాద్ షా లో కూడా మహేష్ వాయిస్ వినిపించింది. అప్పుడు కూడా కేవలం శ్రీనువైట్లపై ఉన్న గౌరవంతోనే ఆ పనికి ఒప్పుకున్నాడు. మరి కాటమరాయుడుకు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే బలమైన ఫ్యాక్టర్ ఏం కావాలి. ఈసారి కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే మిగిలాడు. స్వయంగా పవన్ కోరితేనే మహేష్ ఒప్పుకుంటాడు.. మరి పవన్ అడుగుతాడా… వెయిట్ అండ్ సీ…

Loading...

Leave a Reply

*