ఎన్నికల కోసం పవన్ కు డబ్బు ఎక్కడ్నుంచి వస్తుంది..

untitled-4

అనంతపురం బహిరంగ సభ… వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని పవన్ ప్రకటించేశాడు… ప్రజలు చప్పట్లు కొట్టారు. అంతా బాగానే ఉంది. కానీ పవన్ కు డబ్బు ఎక్కడ్నుంచి వస్తుంది. కేవలం తను ఎమ్మెల్యేగా నిలబడి గెలవాలనుకుంటే పవన్ కు చాలా ఈజీ. కానీ ఇప్పుడు కావాల్సింది తను మాత్రమే గెలవడం కాదు. తన జనసేన పార్టీపై నిలబడే ప్రతి ఒక్క వ్యక్తి గెలవాలి. అలా గెలవాలంటే డబ్బు కావాలి.

ఓవైపు నీతినిజాయితీ కలిగిన వ్యక్తుల్నే బరిలోకి దించుతానంటున్నాడు. ఈ కాలం నీతినిజాయిగా ఉండేవాళ్ల దగ్గర లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి… వాళ్లకు కూడా డబ్బు తనే ఇవ్వాలి. ఇలా చూసుకుంటే పవన్ కు చాలా డబ్బు అవసరం అవుతుంది. మరి ఈ నిధుల్ని పవన్ ఎలా సమకూర్చుకుంటాడు. కేవలం సినిమాలే చేస్తే ఆ డబ్బు వచ్చేస్తుంది. అలా వచ్చిన డబ్బు సరిపోతుందా…

ప్రస్తుతం పవన్ 3 సినిమాలకు కమిట్ అయ్యాడు. ఈ మూడు సినిమాల ద్వారా యావరేజ్ గా 60కోట్లు మాత్రమే సంపాదించగలడు. అతికష్టంమీద మరో సినిమా చేసినా మొత్తం ఎమౌంట్ 80కోట్లు మాత్రమే అవుతుంది. తన దగ్గర ఉన్నది కలుపుకున్నా అంతా కలిసి వంద కోట్లు వరకు సమకూరుతుంది. మరి ఈ వంద కోట్లతో ప్రజారాజ్యం పార్టీని బలోపేతం చేయలగడా.. క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తల్ని, అభ్యర్థుల్ని పోషించగలడా.. ప్రస్తుతం పవన్ మదినే కాదు… జనాల మనసుల్ని కూడా తొలుస్తున్న ప్రశ్న ఇది.

Loading...

Leave a Reply

*