ఆ రెండు సినిమాలకు పవనే బ్రాండ్ అంబాసిడర్…

pawan

ప్రస్తుతం మెగా కాంపౌండ్ లో రెండు పెద్ద సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆ రెండే ధృవ, ఖైదీ నంబర్ 150. ఈ రెండు సినిమాలు కాంపౌండ్ కు చాలా కీలకం. ఎందుకంటే.. వరుస ఫ్లాపులతో ఉన్న చెర్రీ కెరీర్ గాడిలో పడాలన్నా, బన్నీ దూకుడుకు కళ్లెం వేయాలన్నా ధృవ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. మరోవైపు ఖైదీ నంబర్-150 ఇంకా ప్రతిష్టాత్మకం. ఎందుకంటే ఇది చిరు రీఎంట్రీ మూవీ. ఈ విషయంలో ఏదైనా తేడా జరిగితే అందరికీ అవమానమే. అందుకే ఈ రెండు సినిమాల విషయంలో మెగా కాంపౌండ్ ఓ కీలక నిర్ణయమే తీసుకుంది.

ప్రస్తుతం మెగా హీరోల్లో అందరికంటే స్వింగ్ లో ఉన్న హీరో ఎవరనే ప్రశ్నకు ఒకటే సమాధానం. పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అవును.. పవన్ ను రంగంలోకి దించితేనే సినిమాకు క్రేజ్. సప్తగిరి ఎక్స్ ప్రెస్, చల్ చల్ గుర్రం లాంటి చిన్నచిన్న సినిమాలు కూడా పవన్ క్రేజ్ ను వాడుకుంటుంటే.. తమ సినిమాల కోసం ఎందుకు పవన్ ను వాడుకోకూడదని మెగా కాంపౌండ్ భావిస్తోంది. పైగా కీలకమైన 2 సినిమాల విషయంలో పవన్ సేవల్ని కచ్చితంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది.

అందుకే ధృవ, ఖైేదీ నంబర్ 150 సినిమాలు రెండింటికీ పవన్ తో ప్రచారం చేయించాలని చిరంజీవి భావిస్తున్నారట. ఈ రెండు సినిమాల్ని ఎలాగైనా హిట్ చేసే బాధ్యతను పవన్ కు అప్పగించాలని చూస్తున్నారట. అయితే వీటిలో ధృవ సినిమా అల్లు అరవింద్ ది. అరవింద్ సినిమాకు పవన్ ప్రచారం అంటే కాస్త ఆలోచించాల్సిందే. అటు చిరు సినిమాకు ప్రచారం కల్పించడానికి పవన్ కు ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు.

Loading...

Leave a Reply

*