మన్మధుడు పాటతో పవన్ సినిమా…

pawam1

పవన్ సినిమాల్లోని పాటలతో చాలా సినిమాలు తెరకెక్కాయి. నిజానికి పవన్ సినిమా పాటలు మిగతా హీరోలకు సినిమా టైటిల్స్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ పవన్ ఎప్పుడూ మిగతా హీరోల సినిమాల్లోని పాటల్ని తన సినిమా టైటిల్ గా పెట్టుకోలేదు. ఫస్ట్ టైం, పవన్ ఆ పని చేస్తున్నాడు. నాగార్జున నటించిన సంతోషం సినిమాలో దేవుడే దిగి వచ్చినా… స్వర్గమే రాసిచ్చినా అనే పాటలో తొలి పదాల్ని తన కొత్త సినిమాకు టైటిల్ గా పెట్టబోతున్నాడట. అవును… పవన్-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాకు దేవుడే దిగివచ్చినా అనే టైటిల్ అనుకుంటున్నారట.

అయితే.. దీని గురించి ఇంతవరకూ చిత్ర బృందం అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ‘కాటమరాయుడు’ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తోంది. నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ఈనెలాఖరుకు పవన్-త్రివిక్రమ్ కాంబో సినిమాపై ఓ ప్రకటన చేయబోతున్నారు. అప్పుడే టైటిల్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు త్రివిక్రమ్ సినిమాలో కూడా శృతిహాసన్ నే హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నారట.

Loading...

Leave a Reply

*