పవన్ కు ఇప్పుడు ఆ ఒక్కడు చాలు..

pawan1

ప్రస్తుతం కాటమరాయుడు పనుల్లో బిజీగా ఉన్నాడు పవన్. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. హీరోయిన్ ను కూడా ఫైనలైజ్ చేశారు. అయితే తమ్ముళ్ల క్యారెక్టర్లు మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా నలుగురు తమ్ముళ్లు కావాలి. అందుకే దర్శకుడు డాలీ విశ్వప్రయత్నం చేస్తున్నాడు. చాలామందిని సంప్రదిస్తున్నాడు. అయితే అనుకున్న రిజల్ట్ మాత్రం పొందలేకపోతున్నాడట.

పెళ్లిచూపులు చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువహీరో విజయ్ దేవరకొండని సైతం పవన్ కు తమ్ముడిగా నటించాలని కాటమరాయుడు టీం సంప్రదించినట్లు తెలుస్తోంది.అయితే యువహీరోలంతా ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. కాగా దర్శకుడు డాలి పవన్ కు తమ్ముళ్లు గా నటించే వారిని ఎంపిక చేసినట్లు సమాచారం. అజయ్, శివబాలాజీ, కమల్ కామరాజులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వీరిలో అజయ్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు తమ్ముడిగా గబ్బర్ సింగ్ లో నటించాడు.శివబాలాజీ అన్నవరం లో పవన్ తో కలసి నటించిన విషయం తెలిసిందే. కమల్ కామరాజు జల్సాలో ఉన్నాడు.

సో… పవన్ కు ఇప్పుడు ఒక్కడు చాలు. ముగ్గురు తమ్ముళ్లు దొరికేశారు కాబట్టి.. ఆ ఒక్కడి కోసం వేట మొదలుపెట్టారు. పవన్ సినిమాలో నటించడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. కాకపోతే.. కాస్త క్రేజ్ ఉన్న నటుల కోసం డాలీ ప్రయత్నిస్తున్నాడు. అందుకే సెలక్షన్ లేట్ అవుతోంది. ఆ నాలుగో తమ్ముడు ఎవరో త్వరలోనే తేలిపోనుంది.

Loading...

Leave a Reply

*