వామ్మో… పవన్-త్రివిక్రమ్ కాంబోలో కామెడీ సినిమా…

pawan-and-tri

పవన్-త్రివిక్రమ్ కలిస్తే… ఆ కాంబినేషన్ పై ఓ అంచనా ఉంటుంది. ప్రేక్షకులంతా ఓ టైపు మూవీస్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. కాస్త హుందాగా ఉండేవి.ఇంకాస్త సందేశాన్నిచ్చేవి మాత్రమే ఆలోచిస్తారు. ఎందుకంటే.. గతంలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు అలాంటివే మరి. జల్సాలో పవన్ తో జల్సా చేయిస్తూనే.. సెకెండాఫ్ లో నక్సలైట్ గా కూడా చూపించాడు. ఇక అత్తారింటికి దారేది సినిమాలో కుటుంబ బాంధవ్యాన్ని చూపించాడు. అందుకే మూడో సినిమా కూడా అలాంటిదే ఉంటుందని ఎవరైనా ఎక్స్ పెక్ట్ చేస్తారు..

కానీ త్రివిక్రమ్ మాత్రం ఈసారి పవన్ తో ప్రయోగం చేయడానికే సిద్ధమయ్యాడు. పవర్ స్టార్ పవర్ అంతా ఉపయోగించుకొని, ఓ ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమా చేయాలనేది త్రివిక్రమ్ ఆలోచనగా కనిపిస్తోంది. గతంలో వచ్చిన నువ్వే నువ్వే, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు సినిమాలు… కథతోనే కాకుండా కామెడీతో కూడా పిచ్చపిచ్చగా ఎట్రాక్ట్ చేశాయి. ఇప్పుడు అదే కోవలో త్రివిక్రమ్ ఉన్నట్టు తెలుస్తోంది.

నిజానికి త్రివిక్రమ్ ఔట్ అండ్ ఔట్ కామెడీ ప్రయత్నించి ఇప్పటికే ఓసారి ఫెయిల్ అయ్యాడు. మహేష్ బాబుతో చేసిన ఖలేజా సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆయన కెరీర్ లో పూర్తిస్థాయిలో ఫ్లాప్ మూవీ అదే. అందులో ఫుల్ లెంగ్త్ కామెడీ ప్రయత్నించాడు త్రివిక్రమ్. ఇప్పుడు మళ్లీ పవన్ తో అలాంటి ప్రయత్నం అనే టాక్ బయటకొచ్చేసరికి.. పవన్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. చూద్దాం.. పవన్ ఏ స్క్రిప్ట్ నూ అంత తేలిగ్గా వదలడు కదా.

Loading...

Leave a Reply

*