ప‌వ‌న్ భార్య ఫోటోల‌ను డిలీట్ చేసింది ఎవ‌రు..?

p

ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా. ఆమె గురించి తెలిసింది చాలా త‌క్కువ‌. ర‌ష్య‌న్ మోడ‌ల్ అనే రూమ‌ర్ మిన‌హా మిగిలిన విశేషాలు మాత్రం అంత‌గా తెలియ‌వు. నిన్న‌మొన్న‌టిదాకా ఆమె ఫంక్ష‌న్‌ల‌కు దూరంగా ఉండేది. కానీ, ఇప్పుడిప్పుడే లెజినోవా మెగా ఫ్యామిలీలో జ‌రిగే కొన్ని ఇంపార్టెంట్ ఫంక్ష‌న్‌ల‌తోపాటు ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు కూడా ఆమె అడుగుపెడుతున్నారు.

మొన్న చిరంజీవి బ‌ర్త్ డే వేడుక‌ల‌లో ఆమె త‌ళుక్కున మెరిశారు. ఆ త‌ర్వాత శ్రీజ రెండో మ్యారేజ్ వేడుక‌ల‌లోనూ లెజినోవా హాజ‌ర‌య్యారు. మెగా ఫ్యామిలీ ఫంక్ష‌న్‌ల‌కు ప‌వ‌న్ దూరంగా ఉంటారు. కానీ, లెజినోవా మాత్రం సంద‌డి చేస్తున్నారు. అలాంటి లెజినోవాను ఇటీవ‌ల మంచు ఫ్యామిలీ త‌మ స్కూల్‌లో జ‌రిగిన హాలోవీన్ పార్టీకి ర‌మ్మ‌ని ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మానికి కూతురుతో స‌హా వ‌చ్చింది లెజినోవా. అటు ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా వ‌చ్చారు.

లెజినోవా క‌నిపించిందో లేదో కానీ… ఫోటోగ్రాఫ‌ర్‌లంతా త‌మ కెమెరాల‌కు ప‌ని చెప్పారు. చ‌క‌చ‌కా ఫోటోలు తీసేశారు. ఇలాంటి ఫోటోలు ఆమెకు ఇష్టం ఉండ‌దు. అందుకే, ఆ ఫోటోగ్రాఫ‌ర్‌ల‌ను రిక్వెస్ట్ చేసింద‌ట‌. త‌న ఫోటోలు ద‌య‌చేసి డిలీట్ చెయ్య‌మ‌ని అడిగారు. అంత పెద్ద సెలబ్రిటీ అంత సున్నితంగా రిక్వెస్ట్‌ చేసేసరికి అందరూ ఆమె ఫోటోలను డిలీట్‌ చేసేశారట. ఎవరో కొందరు స్టూడెంట్లు మాత్రం ఆమె ఫోటోలను డిలీట్‌ చేయకుండా సోషల్‌ మీడియాలో పెట్టారు.

Loading...

Leave a Reply

*