ఆ సినిమాని క‌ట్ కాపీ పేస్ట్ చేస్తున్న ప‌వ‌న్‌.. ఈ పోస్ట‌ర్‌తో అడ్డంగా బుక్ అయ్యాడు..!

katamarayudu

కాట‌మ‌రాయుడు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ లేటెస్ట్ మూవీ. ఈ సినిమా త‌మిళ్‌లో అజిత్ న‌టించిన వీర‌మ్‌కి రీమేక్ అని స‌మాచారం. కానీ, ఇంత‌వ‌ర‌కు సినిమా యూనిట్ మాత్రం దానిని అఫిషియ‌ల్‌గా క‌న్‌ఫ‌మ్ చెయ్య‌లేదు. ఆ సినిమా నుంచి ఇన్‌స్ప‌యిర్ అయ్యార‌ని కొంద‌రు చెబుతుంటే.. కాదు, ఆ సినిమాకి తెలుగు వెర్ష‌న్ కాట‌మ‌రాయుడు అని మ‌రికొంద‌రు చెబుతున్నారు. ఇందులో ఏది నిజ‌మో అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.ఆ విష‌యం ప‌క్క‌న‌పెడితే.. కాట‌మ‌రాయుడు చిత్రం అజిత్ వీర‌మ్‌కి ప‌క్కా రీమేక్ అని ఈ స్టిల్ చూస్తే అర్ధ‌మ‌వుతోంది. దీపావ‌ళి కానుక‌గా రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌తో ఆయ‌న అడ్డంగా బుక్క‌య్యాడంటున్నారు.

పై రెండు స్టిల్స్‌ని ప‌క్క ప‌క్క‌న పెట్టుకొని చూస్తే.. కాట‌మ‌రాయుడు, వీర‌మ్ సినిమాలు రెండూ ఒక‌టేన‌నే ఫీల్ రాక త‌ప్ప‌దు. అయితే, వీర‌మ్‌లో అజిత్ పంచెక‌ట్టు లుక్‌లో క‌నిపిస్తే.. ప‌వ‌న్ ఇక్క‌డ ప్యాంట్‌తో ద‌ర్శ‌న‌మిచ్చాడు. ప‌వ‌న్ కూడా అదే మేకోవ‌ర్ మెయింటెన్ చేసి ఉంటే అదిరిపోయేది.ఫ్యాక్ష‌నిజం బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోంది ఈ సినిమా. అన్నాద‌మ్ముల అనుబంధంతో తెర‌కెక్కుతోంది ఈ మూవీ. శృతిహాస‌న్‌ది కీ రోల్‌.

ఈ సినిమాతో ప‌వ‌న్ అటు పొలిటిక‌ల్‌గా కూడా కొన్ని కీలక అంశాల‌ను ట‌చ్ చెయ్య‌నున్నాడ‌ట‌. తెలుగు రాష్ట్రాల‌లోని అన్ని రాజ‌కీయ పార్టీల‌ను త‌న‌దైన శైలిలో సెటైర్‌లు వెయ్య‌నున్నాడ‌ని తెలుస్తోంది.ఈ సినిమాతో కంప‌ల్స‌రీగా హిట్ కొట్టాల్సిన సిచ్యువేష‌న్‌లో ఉన్నాడు ప‌వ‌ర్ స్టార్‌. ఈ ఏడాది స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌తో ప‌వ‌న్‌.. ఫ్లాప్ ఇచ్చాడు. సో.. ఆయ‌న మార్కెట్‌ని నిలబెట్టుకోవాలంటే.. కాట‌మ‌రాయుడుతో స‌క్సెస్ అందుకోవాల్సిన ప‌రిస్థితి. మ‌రి, ప‌వ‌న్ కాట‌మ‌రాయుడిగా ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.

Loading...

Leave a Reply

*