ప‌వ‌న్ చించేశాడుగా.. కాట‌మరాయుడు లుక్ పేలింది..!

pawan

పవ‌న్ అదుర్స్ అనిపించాడు. ఇదీ ఒక్క ముక్క‌లో చెప్పాలంటే కాట‌మ‌రాయుడు ఫ‌స్ట్ లుక్‌పై వ‌స్తున్న కామెంట్స్‌. దీపావ‌ళి కానుక‌గా ఈ సినిమా ప‌స్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. అయితే, ఇది ఆషామాషీగా ఉంటుంద‌ని భావించారంతా. ఎందుకంటే, ప‌వ‌న్ అటు రాజ‌కీయాలు, ఇటు సినిమాల మ‌ధ్య జ‌ర్నీ చేస్తున్నాడు. దీంతో, ఫోక‌స్ స‌రిగా పెట్ట‌లేక‌పోతున్నాడనే కామెంట్స్ వినిపించాయి. అలాంటిదేమీ లేకుండానే.. ప‌వ‌న్ అంద‌రికీ షాక్ ఇస్తూ మెస్మ‌రైజింగ్ లుక్‌తో షాక్ ఇచ్చాడు.

గోపాల గోపాల  త‌ర్వాత ప‌వ‌న్‌-డాలి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న సినిమా ఇది. ఇది ఫ్యాక్ష‌నిజం బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న రొమాంటిక్ ఎంట‌ర్‌ట‌యిన‌ర్‌. గ‌బ్బ‌ర్‌సింగ్ త‌ర్వాత పవ‌న్‌-శృతి క‌లిసి జంటగా న‌టిస్తున్న చిత్రం కూడా ఇదే. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ ఏడాది విడుద‌ల‌యిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ ఫ్లాప్ అయింది. దీంతో, ప‌వ‌న్ కంప‌ల్స‌రీగా హిట్ కొట్టాల్సిన పొజిష‌న్‌లో ఉన్నాడు.

తమిళ్‌లో తెర‌కెక్కిన వీర‌మ్‌కి ఇది రీమేక్ అనే టాక్ వినిపిస్తోంది. కొంద‌రు మాత్రం కేవ‌లం ఇన్‌స్పిరేష‌న్‌గానే తీసుకున్నారంటున్నారు. ఉగాది కానుక‌గా వ‌చ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ కానుంది ఈ చిత్రం. మ‌రి, కాట‌మ‌రాయుడుతో ప‌వ‌న్ ఎలాంటి సంచ‌ల‌నం క్రియేట్ చేస్తాడో చూడాలి.

Loading...

Leave a Reply

*