బ‌న్నిపై క‌క్ష తీర్చుకున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌…!

bunny

చెప్ప‌ను బ్ర‌ద‌ర్‌…. నాలుగు నెల‌ల క్రితం ఈ డైలాగ్ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ అయింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌గురించి చెబుతారా..? అని అడిగిన ప్ర‌శ్న‌కు స్ట‌యిలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్ప‌ను బ్రద‌ర్ అన్న‌మాట మెగా ఫ్యాన్స్‌ని కుదిపేసింది. వారిలో చీలిక‌లు తెచ్చింది. అంతే, బ‌న్ని వ‌ర్సెస్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏదో జ‌రుగుతోందంటూ వార్త‌లు వ‌చ్చాయి. వాటిని క‌ట్ చేసేందుకు బ‌న్ని.. ఒక మన‌సు ఆడియో ఫంక్ష‌న్‌లో పెద‌వి విప్పాడు. ఆడియో ఫంక్ష‌న్‌లు, మెగా ఈవెంట్‌ల‌లో చిరంజీవి మాట్లాడుతున్న‌ప్పుడు కూడా ప‌వ‌న్‌ఫ్యాన్స్ చేసే వీరంగం చూడ‌లేకే ఇలా చేశానంటూ ఆయ‌న చెప్పుకొచ్చాడు.

చెబుతాను బ్ర‌ద‌ర్ అంటూ బ‌న్ని చెప్పిన ఆ నాలుగు మాట‌లు ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని మ‌రింత హ‌ర్ట్ చేశాయే కానీ, ఆలోచింప చెయ్య‌లేద‌ని మెగా ఫ్యాన్స్‌లోని కొంద‌రు బ‌హిరంగంగా వ్యాఖ్యానించారు.ఇదంతా కొన్ని నెల‌ల క్రితం జ‌రిగిన‌ ఎపిసోడ్. తాజాగా దీపావ‌ళి కానుక‌గా మెగా హీరోలంతా ఒక్క‌టై ఫోటో దిగారు. ఇందులో, ప‌వ‌న్ మిన‌హా మిగిలిన మెగా హీరోలంతా ఉన్నారు. చిరంజీవి, బ‌న్ని, చెర్రీ, సాయిధ‌ర‌మ్ తేజ్‌, వ‌రుణ్ తేజ‌తోపాటు అల్లు శిరీష్ కూడా అటెండ‌య్యారు. నిన్న సాయంత్రం మెగా కాంపౌండ్‌నుంచి ఈ ఫోటోని రిలీజ్ చేశారు. అంతే, కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే అల్లు హీరోల‌ను ఎడిట్ చేసి వారి స్థానంలో ప‌వ‌న్‌ని పోస్ట్ చేశారు

. ప‌వ‌న్‌ని ఫాలో అయ్యే చాలా ఫేస్ బుక్ పేజీల‌లో ఈ ఎడిటెడ్ ఫోటో ద‌ర్శ‌న‌మిస్తోంది. ప‌వనిజం పేరుతో కొంద‌రు దీనిని సోష‌ల్ మీడియాలో ప్ర‌మోట్ చేస్తున్నారు.ఇలా మెగా ఫ్యామిలీలోని హీరోల‌లో చీలిక వ‌చ్చింద‌ని కొంద‌రంటుంటే, మరికొంద‌రు మాత్రం.. బ‌న్నిపై ప‌వ‌న్ అభిమానులు క‌క్ష తీర్చుకున్నార‌ని అంటున్నారు. చెప్ప‌ను బ్ర‌ద‌ర్ టైమ్‌లో బ‌న్ని చేసిన కామెంట్స్‌కు వ్య‌తిరేకంగానే ఇలా చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి, దీనిపై అల్లు ఫ్యామిలీ ఎలా రియాక్ట‌వుతుందో చూడాలి.

Loading...

Leave a Reply

*