ప‌వ‌న్.. మామ‌య్య అయ్యాడోచ్‌…!

pavan

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్పుడో మామ‌య్య‌గా మారిపోయాడు. ఆయ‌న సోద‌రి త‌న‌యుడే సాయిధ‌ర‌మ్ తేజ్‌. మ‌రి, ఇప్పుడేంటి ఇది కొత్త‌గా అని భావిస్తున్నారా..? అది రియ‌ల్‌గా. ఇది ఆయ‌న రీల్ సిస్ట‌ర్ స్టోరీ. అన్న‌వ‌రం సినిమా గుర్తుందా..? ఈ సినిమాలో ప‌వ‌న్ చెల్లిగా న‌టించింది సంధ్య‌. ప్రేమిస్తే సినిమాతో తెలుగులోనూ భారీ పాపులారిటీ తెచ్చుకున్న సంధ్య‌.. అన్న‌వ‌రంలో ప‌వ‌న్ సిస్ట‌ర్ రోల్ పోషించింది.ఈ సినిమా మొత్తం సిస్ట‌ర్ సెంటిమెంట్ మీదే న‌డుస్తోంది. తొలిప్రేమ త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన మ‌రో సిస్ట‌ర్ సెంటిమెంట్ మూవీ ఇది.

త‌మిళ్‌లో హిట్ అయిన ఓ సినిమాకి ఇది రీమేక్‌. సుస్వాగ‌తం త‌ర్వాత భీమ‌నేని శ్రీనివాస‌రావు-ప‌వ‌న్ కాంబినేష‌న్‌లో రూపొందింది ఈ చిత్రం. అయితే, ఈ మూవీ ఫెయిల‌య్యింది. సంధ్యకు ఆ త‌ర్వాత స‌రైన ఆఫ‌ర్‌లు రాలేదు. దీంతో, పెళ్లి చేసుకొని సెటిల‌యింది సంధ్య‌.నిన్న చెన్నైలో ఆమె ఓ పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ ఆనందాన్ని త‌న అభిమానుల‌తో షేర్ చేసుకుంది. త‌మ కుటుంబంలోకి వ‌చ్చిన కొత్త వ్య‌క్తిని ఆశీర్వ‌దించాల‌ని కోరింది. ఇలా, ప‌వ‌న్‌ని మామ‌య్య‌గా మార్చింది సంధ్య.

Loading...

Leave a Reply

*