ఒక్క మగాడు అంటే నిజంగా బాలయ్యే…

balayya

బాలయ్య గురించి ఈమధ్య కాలంలో ఎన్నో నెగెటివ్ వార్తలు చదివాం. కానీ బాలయ్య అంటే కేవలం అది మాత్రమే కాదు. ఇంకా చాలా మంది. నటసింహం అనే బిరుదు బాలయ్యకు ఊరికే రాలేదు. సినిమా విషయంలో నటిసింహంపై ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క కంప్లయింట్ కూడా రాలేదు. సినిమాలంటే బాలకృష్ణకు అంత నిబద్ధత, అంత ప్రేమ. తాజాగా గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించి బాలయ్య తీసుకున్న ఓ నిర్ణయం… టోటల్ టాలీవుడ్ నే షాక్ కు గురిచేస్తోంది.

క్రేజ్ ఉంటే క్యాష్ చేసుకోవాలని చూసుకునే ఈ రోజుల్లో… బాలయ్య కావాలనే తన రెమ్యునరేషన్ ను తగ్గించుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. బాలయ్యతో వందో సినిమా చేసేందుకు ఎంతమంది క్యూ కట్టారో అందరికీ తెలిసిందే. చివరికి ఆ అవకాశం క్రిష్ కు దక్కింది. పనిలో పనిగా తను కూడా సహనిర్మాతగా మారి క్రిష్ ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం బాలయ్యకు నిర్మాతలు 10కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమయ్యారట. డబ్బుతో బాలయ్య దగ్గరకు వెళ్తే… బాలయ్య మాత్రం 8కోట్లు మాత్రమే తీసుకున్నాడట.

మిగతా 2 కోట్లు నిర్మాతల దగ్గరే ఉంచమన్నాడట బాలయ్య. వందో సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోందని, బడ్జెట్ కూడా ఎక్కువ అవుతోంది కాబట్టి.. అవసరమైతే.. ఈ 2కోట్లు నిర్మాణానికి ఖర్చుపెట్టమని తిరిగి ఇచ్చేశాడట. దీంతో నిర్మాతల ఆనందంతో నిర్మాతల కళ్లల్లో నీళ్లు తిరిగాయట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ లో హల్ చల్ చేస్తౌోంది.

Loading...

Leave a Reply

*