షాకింగ్… రాజమౌళి కోసం తారక్ వెయిటింగ్..

ntr

బాహుబలి-2 తర్వాత రాజమౌళి చేయబోయే సినిమాపై అందరి దృష్టిపడింది. జక్కన్న ఎలాంటి సినిమాతో తెరపైకొస్తాడనే ఇంట్రెస్టింగ్ బజ్ నడుస్తోంది. అయితే రాజమౌళి మాత్రం బాహుబలి-2 విడుదలైన తర్వాత కొన్నాళ్లు రెస్ట్ తీసుకుంటానని చెబుతున్నాడు. ఆ తర్వాత మాత్రమే కొత్త సినిమా సంగతులు వెల్లడిస్తానని కూడా అంటున్నాడు. ఇదిలా ఉండగా… జనతా గ్యారేజ్ తో సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం రాజమౌళి కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

జనతా గ్యారేజ్ లాంటి సూపర్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ సైలెంట్ అయిపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. రాజమౌళితో సినిమా చేసేందుకు తారక్ ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. అటు రాజమౌళి మాత్రం వచ్చే ఏడాది మే నెల వరకు కొత్త సినిమా గురించి ఆలోచించే పరిస్థితిలో లేడు. సో.. బాహుబలి-2 తర్వాత కచ్చితంగా తనతోనే సినిమా చేయాలంటూ రాజమౌళి నుంచి తారక్ మాట తీసుకున్నట్టు తెలుస్తోంది.

తారక్-జక్కన్న మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తారక్ కు తెరవెనక మెంటర్ రాజమౌళి. అందుకే ఎన్టీఆర్ నోరుతెరిచి అడిగిన వెంటనే రాజమౌళి కాదనలేకపోయాడని తెలుస్తోంది. సో.. ఈ 6 నెలల గ్యాప్ లో పూరి జగన్నాధ్ లాంటి స్పీడ్ దర్శకుడితో వర్క్ చేసి, తర్వాత జక్కన్నతో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి ఎన్టీఆర్ స్కెచ్ రెడీ చేస్తున్నాడట.

Loading...

Leave a Reply

*