రూట్ మార్చిన తార‌క్‌.. బ‌న్నిలో టెన్ష‌న్ టెన్ష‌న్‌..!

bunny

తార‌క్ రూట్ మార్చాడు. నిన్న‌టిదాకా ఆయ‌న పూరి జ‌గ‌న్నాథ్‌తో ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌ట‌యినర్ చెయ్యాల‌ని ప్లాన్ చేశాడు. ఇప్పుడు అది వాయిదా ప‌డిన‌ట్లు స‌మాచారం. ఇజం సినిమా ఆశించిన రేంజ్‌లో స‌క్సెస్‌కాక‌పోవ‌డంతో.. పూరి సినిమాని దాదాపు పోస్ట్ పోన్ చేసిన‌ట్లే అని స‌మాచారం. తార‌క్ డైరెక్ట్‌గానే పూరికి ఆ విష‌యం చెప్పాడ‌నే టాక్ న‌డుస్తోంది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో. దీంతో, తార‌క్ ముందు మూడు ఆప్ష‌న్‌లు క‌నిపించాయ‌ట‌. ఒక‌టి.. ప‌టాస్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో సినిమా చెయ్య‌డం. 2. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో మూవీకి క‌మిట్ అవ్వ‌డం 3. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో అదుర్స్ 2ని ప్లాన్ చెయ్య‌డం.

ఈ మూడు ఆప్ష‌న్‌ల‌లో తార‌క్‌.. మూడో దానినే ఎంచుకున్నట్లు స‌మాచారం. అదుర్స్ సీక్వెల్‌ని ప్లాన్ చెయ్యాల‌ని వినాయ‌క్‌ని కోరాడ‌ట తార‌క్‌. ప్ర‌స్త‌తం ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంతో బిజీగా ఉన్న ఈ మాస్ డైరెక్ట‌ర్‌… ఓకే అని చెప్పి త‌న రైట‌ర్‌ల‌కు ఆ ప‌నులు అప్ప‌జెప్పాడ‌ట‌. దీంతో, ఓ వైపు క‌థా చ‌ర్చ‌లు ఇప్పటికే షురూ అయ్యాయని చెబుతున్నారు.ఇదే ఇప్పుడు బ‌న్నిలో టెన్ష‌న్ పెంచుతోంద‌ట‌. స్ట‌యిలిష్ స్టార్ కూడా తాజాగా అదుర్స్ 2లాంటి వైవిధ్య‌మైన క‌థ‌లో న‌టిస్తున్నాడ‌నే ప్రచారం జ‌రుగుతోంది. అదుర్స్ సినిమాకి క‌థ రాసిన వారిలో ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కూడా ఒక‌డ‌ట‌. ఆయ‌న చెప్పిన లైన్‌నే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌గా తెర‌కెక్కుతోంద‌ట‌. అంటే దువ్వాడ జ‌గ‌న్నాథమ్ క‌థ‌కి, అదుర్స్ సీక్వెల్ క‌థకి మ‌ధ్య సారూప్య‌త ఉండే చాన్స్ ఉంద‌ట‌.

అంటే, ఈ ఇద్ద‌రి న‌ట‌న‌లో ఎవ‌రు గ్రేట్ అనే క్వ‌శ్చ‌న్ రాక మాన‌దు. కామెడీ టైమింగ్‌లో అదుర్స్ మూవీలో ది బెస్ట్ అనిపించుకున్న తార‌క్‌.. అదుర్స్ 2లో మ‌రింత మార్వెల‌స్‌గా న‌టించ‌డం ఖాయమంటున్నారు నంద‌మూరి అభిమానులు. అదే, బ‌న్ని విష‌యానికి వ‌స్తే అదుర్స్ లాంటి క‌థ ఆయ‌న‌కు అంత సెట్ అవ‌ద‌ని, సో.. బ‌న్నికంటే తార‌క్‌దే అప్ప‌ర్ హ్యాండ్ అవుతుంద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు, మెగాభిమానులు మాత్రం.. బ‌న్ని ఆల్‌రౌండ‌ర్ అని ఎవ‌రి స‌త్తా ఏంటో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర తెలుస్తుంద‌ని ప్ర‌తి స‌వాల్ విసురుతున్నారు. మ‌రి, యంగ్‌టైగ‌ర్ వ‌ర్సెస్ బ‌న్ని వార్‌లో ఎవ‌రి స‌త్తా ఏంటో 2017లో తేల‌నుంద‌న్న‌మాట‌.

Loading...

Leave a Reply

*